Jr. NTR : వార్ 2 లో ఎన్టీఆర్ లుక్ ఇదేనా..?

Jr. NTR : వార్ 2 లో ఎన్టీఆర్ లుక్ ఇదేనా..?
X

ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం స్ట్రాంగ్ గా చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం దేవర 1 షూటింగ్ తో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం ఒకేసారి డేట్స్ ఇస్తున్నాడు. కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ అన్నట్టుగా గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాడు తారక్. ఇక దేవర నుంచి సెకండ్ సింగిల్ ఈ రెండు మూడు రోజుల్లోనే విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ తో సాగే రొమాంటిక్ సాంగ్ గా చెబుతున్నారీ పాటను. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.

ఇక వార్ 2 ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో ఇద్దరూ ఇండియన్ స్పై ఏజెంట్స్ గా నటిస్తున్నారనే ప్రచారం ఉంది. బాలీవుడ్ లో స్పై మూవీస్ కు మంచి ఆదరణ ఉంది. ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.. హృతిక్ కంట్రీ మొత్తం ఫేవరెట్ హీరోస్ లో ఒకడు. సో.. ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందనే అంటున్నారు. లేటెస్ట్ గా వార్ 2 లో ఎన్టీఆర్ లుక్ ఇదే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ పిక్ చూడగానే ఫైరింగ్ గా ఉంది. చుట్టూ ఆయుధాలు, ఒక బ్లాక్ బోర్డ్, మినిమం ఫెసిలిటీస్ తో మాత్రమే ఉన్న ఒక చిన్న రూమ్ లో ఎన్టీఆర్ తలదాచుకున్నట్టుగా కనిపిస్తోందీ ఫోటో. అయితే చాలామంది ఇది ఫేక్ అంటున్నారు. బట్ లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. మరి ఇది నిజమా కాదా అనేది మూవీ టీమే చెప్పాలి.

Tags

Next Story