Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఇదేనా..?

Aadarsha Kutumbam :  ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఇదేనా..?
X

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న మూవీ ఆదర్శ కుటుంబం : హౌస్ నంబర్ 47, ఏకే 47. టైటిల్ డిఫరెంట్ గా ఉంది. ఆదర్శకుటుంబం అనడంతో పాటు దానికి ఏకే 47 యాడ్ చేయడం వల్ల ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. అన్నిటికి మించి త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ రావాలని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. అది ఇన్నాళ్లకు ఫైనల్ అయింది. ఈ కాంబోలో వస్తోన్న మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సమ్మర్ లో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు. దీంతో చాలామంది ఈ మూవీ సమ్మర్ లో వస్తుందనుకున్నారు. బట్ ఈ విషయంలో కాస్త మూవీ టీమ్ డిజప్పాయింట్ చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ డేట్ లో రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. నిజానికి ఈ యేడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. మరి ఆ టైమ్ కు విడుదల అంటే ఓ రేంజ్ లో ఉండేది. వీళ్లు ఆ టైమ్ కంటే చాలా ముందుగానే విడుదల చేయాలనుకోవడం వెనక ఉన్న కారణాలేంటో తెలియదు. కానీ ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే తెలిసిపోయింది. ఇక అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రమే మిగిలుంది.

Tags

Next Story