Sreeleela : శ్రీ లీల అందుకే టాలీవుడ్ ను వదిలేస్తోందా..?

Sreeleela :  శ్రీ లీల అందుకే టాలీవుడ్ ను వదిలేస్తోందా..?
X

గ్లామర్ ఉండగానే బ్యాంక్ బ్యాలన్స్ చక్కబెట్టుకోవాలనేది సినిమా వారి సామెత. ముఖ్యంగా కెరీర్ స్పాన్ తక్కువగా ఉండే హీరోయిన్లకు ఇది బాగా వర్తిస్తుంది. ఒక్క హిట్టు పడగానే డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ తో పాటు అందగత్తెల డిమాండ్స్ కూడా పెరుగుతుంటాయి. అలా ధమాకాతో తెలుగులో తిరుగులేని ఇంపాక్ట్ వేసి వరుస ఆఫర్స్ అందుకుంది శ్రీ లీల. కానీ అదే స్థాయిలో విజయాలు రాలేదు. అయినా అమ్మడి రేంజ్ తగ్గలేదు. ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. పైగా కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది. శివకార్తికేయన్ సరసన పరాశక్తి అనే మూవీతో తెరంగేట్రం చేస్తోందక్కడ. ఇటు తెలుగులో మాత్రం సినిమాలు తగ్గించుకుంటూ వస్తోంది. త్వరలో విడుదల కాబోతోన్న జూనియర్ ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. ఆ మధ్య అక్కినేని అఖిల్ సరసన లెనిన్ అనే మూవీలో ఆఫర్ అందుకున్నా.. తాజాగా వదులుకుంది. అందుకు కారణం బాలీవుడ్. యస్.. బాలీవుడ్ వల్లే తను టాలీవుడ్ కు దూరం అవుతోంది.

ప్రస్తుతం శ్రీ లీల ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉందనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. సూపర్ హిట్ ఫ్రాంఛైజీగా ఉన్న ఆషిఖి మూవీ థర్డ్ పార్ట్ లో నటిస్తోంది తనిప్పుడు. అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ కోసం అమ్మడికి ఏకంగా 3.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అయితే సెట్స్ లో తన నటన చూసిన వాళ్లంతా ఫిదా అవుతున్నారట. ఖచ్చితంగా బాలీవుడ్ లో శ్రీ లీల తనదైన ముద్రను వేస్తుంది అనే కామెంట్స్ చేస్తున్నారట. అవన్నీ నిజమే అనుకుందో లేక నిజంగానే ఆఫర్స్ వస్తున్నాయో కానీ.. తన నెక్ట్స్ హిందీ మూవీకి 6 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే తన టాలెంట్ తెలిసిన వాళ్లు ఆ మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారని టాక్. కాకపోతే ఆషిఖి 3 రిలీజ్ అయితే ఇంకా తన డిమాండ్ పెరుగుతుందని కొందరు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారంటున్నారు. సో.. టాలీవుడ్ లో మహా అయితే ఓ రెండు కోట్లు.. ఇంకో రెండు మూడు బ్లాక్ బస్టర్స్ పడితే 3 కోట్ల వరకూ అందుకోగలదు. అదే బాలీవుడ్ లో అయితే. డెబ్యూ మూవీకే మూడున్నర కోట్లు. తర్వాతి సినిమాలకు డబుల్ డిమాండ్ చేయొచ్చు. అందుకే తను మెల్లగా సౌత్ సినిమాలు తగ్గించుకుంటూ వస్తోందట. మరి ఇందులో నిజమెంత అనేది తన టీమ్ చెప్పాలి. లేదంటే ఇలాంటివి ఇంకా పెరుగుతూ ఉంటాయి.

Tags

Next Story