Balakrishna : అన్ స్టాపబుల్ ప్రమోషన్స్ గా మారిందా..?
సెలబ్రిటీస్ కు సంబంధించి ఏదైనా రియాలిటీ షో అంటే వారి పర్సనల్ లైవ్స్ కు సంబంధించిన విశేషాలు పంచుకుంటారు. అభిమానులకు ఆనందాన్ని కలిగించేవో.. ఎమోషన్ ను పంచేవో ఉంటాయి. బట్ రియాలిటీ షోస్ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన ఇంటర్వ్యూస్ గా మారితే మాత్రం ఖచ్చితంగా అవేమంత ఆసక్తిగా కనిపించవు. కొన్నాళ్ల క్రితం ఈటీవీలో ప్రసారమైన అలీతో సరదాగా మొదట మంచి టాక్ షో అనిపించుకున్నా.. రిపీట్ గెస్ట్స్ తో పాటు మూవీ ప్రమోషన్స్ తో బోరింగ్ గా మారింది. అలీ హోస్టింగ్ చాలామందికి నచ్చింది కూడా. బట్ ఈ తరహా అంశాలతో ఆ షోనే ఆగిపోయింది.
ఇక నందమూరి బాలకృష్ణ వంటి రోరింగ్ స్టార్ తో హోస్టింగ్ చేయించడం అనే కొత్త ఐడియాతో ముందుకు వచ్చిన ఆహా వారి అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ షో కు గెస్ట్స్ గా వచ్చిన వాళ్లను కేవలం బాలయ్య మాత్రమే అడగగలడు అనిపించే ప్రశ్నలతో ప్రేక్షకులను అలరించారు. సెకండ్ సీజన్ కాస్త డల్ అయిందనేది వాస్తవం. ఈ సీజన్ లో పొలిటీషియన్స్ కూడా ఎంటర్ అయ్యారు. అఫ్ కోర్స్ అదీ మంచిదే. బట్ గెస్ట్ ఎవరైనా షో రక్తి కట్టడం ఇంపార్టెంట్. బాలయ్య అదరగొట్టినా.. ఎందుకు సెకండ్ సీజన్ కాస్త డల్ అయింది. ఈ సీజన్ లో కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ లాగా కొన్ని ఎపిసోడ్స్ సాగాయి. ఇవి రొటీన్ గా అనిపించాయి.
ఇక చాలామంది ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా ఎదురుచూస్తోన్న థర్డ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సీజన్ కూడా మూవీ ప్రమోషన్స్ లాగానే కొనసాగుతోందనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గానే కంగువా మూవీ టీమ్ తో ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ తర్వాత విశ్వంభర టీమ్ అంటున్నారు. సరే విశ్వంభర అంటే మెగాస్టార్ ఉంటాడు. ఆయన ఇంత వరకూ రాలేదు కాబట్టి ఫ్యాన్స్ కు ఇదో స్పెషల్ ఎపిసోడ్ అవుతుంది. ఇక పుష్ప 2 టీమ్ తో కూడా ఓ ఇంటర్వ్యూ ఉంటుందంటున్నారు. ఆల్రెడీ పుష్ప 1 తో ఇదే షోలోనే ఓ ఎపిసోడ్ వచ్చింది. మళ్లీ సెకండ్ పార్ట్ కు సంబంధించిన విశేషాలు తప్ప ఇంకేం ఉంటాయి. సో.. ఇంకేదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు వస్తే తప్ప ఈ సీజన్ సక్సెస్ కాదు. కేవలం మూవీ ప్రమోషన్స్ లా కనిపించే ఇంటర్వ్యూస్ అంటే బాలయ్య హోస్ట్ కాబట్టి కొన్ని ప్రశ్నలు డేరింగ్ గా అడగొచ్చేమో కానీ.. మిగతా అంతా రొటీన్ మూవీ స్టఫ్ తప్ప ఇంకేం ఉండదు కదా.. ఏదేమైనా అన్ స్టాపబుల్ ఇప్పటికే మూవీ ప్రమోషన్స కు వేదిక అయింది అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. దీన్ని మార్చి కొత్త ఐడియాస్ తో రావాల్సింది పోయి మళ్లీ అవే కంటిన్యూ చేస్తే అసలు షో కే ఎసరు పడే ప్రమాదమూ లేకపోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com