Upendra UI : ఉపేంద్ర మరో సంచలనం సృష్టించబోతున్నాడా

Upendra UI :  ఉపేంద్ర మరో సంచలనం సృష్టించబోతున్నాడా
X

ఇండియన్ సినిమా హిస్టరీలో ఉపేంద్ర లాంటి నటులు, టెక్నీషియన్స్ అరుదుగా ఉంటారు.అతనో ఆల్ రౌండర్. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై.. కన్నడ ఇండస్ట్రీనే మలుపు తిప్పిన ష్, ఓమ్ వంటి మూవీస్ తో తనకంటూ సరికొత్త క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత తనే హీరోగా రూపొందించిన ఏ, ఉపేంద్ర వంటి మూవీస్ ఆ రోజుల్లోనే ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. అందుకే ఉపేంద్రకు దేశవక్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు ఉపేంద్ర. 2015లో రూపొందించిన ఉప్పి 2 ఆశించినంత పెద్ద విజయం సాధించలేదు. నిజానికి కన్నడ నుంచి ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ అంటే ఉపేంద్ర అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ స్థాయి సినిమాలకు మంచి స్పాన్ ఉంది. అందుకే 9యేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి ‘యూఐ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

యూఐ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. స్టోరీ టెల్లింగ్ లో ఉపేంద్ర స్టైల్ ఇంకెవరికీ రాదు. అది ఈ ట్రైలర్ తో మరోసారి కనిపిస్తోంది. పూర్తి వైవిధ్యమైన బ్యాక్ డ్రాప్ లో తనకే సాధ్యమైన స్క్రీన్ ప్లేతో ఈ స్టోరీచెప్పబోతున్నాడు అనిపిస్తోంది. ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. మన దేశాన్ని ఏళ్ల తరబడి శాసిస్తోన్న ఓ సామాజిక రుగ్మతపై తనదైన శైలిలో సెటైరికల్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకూ ఉపేంద్ర కెరీర్ లో ఎక్కువగా విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కు పెద్దగా స్కోప్ లేదు. ఈ సారి ఆ ప్రయోగం కూడా చేశాడు.

ఈ నెల 20న విడుదల కాబోతోన్న యూఐ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.ఈ మూవీతో శాండల్ వుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోందని ఇప్పటికే అర్థమైంది. ఇక ఉపేంద్రతో పాటు రీష్మా నానయ్య, సన్నీలియోన్, సాధు కోకిల, జిషుసేన్ గుప్తా, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ మూవీతో ఉప్పీదాదా ఎన్ని సంచలనాలు సృష్టించబోతున్నాడో చూడాలి.

Tags

Next Story