Vijay Devarakonda : విజయ్ దేవరకొండ టీజర్ డేట్ మారిందా

టాలెంటెడ్ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై భారీ అంచనాలున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అతను ఓ ఏజెంట్ గా నటించాడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చాలా సీక్రెట్స్ మెయిన్టేన్ చేస్తున్నారు. ఏజెంట్ అని తెలిసినా అంతకు మించి ఇంకేం చెప్పలేదు. కాకపోతే నిర్మాత నాగవంశీ ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకువస్తాం అనే అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి ‘వి.డి12’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోందీ చిత్రం. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా ఉందనే వార్తలు వచ్చాయి కానీ ఎవరూ కన్ఫార్మ్ చేయలేదు.
ఇక మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ అయింది. మే 30న రిలీజ్ చేయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ ను ఈ నెల 7న విడుదల చేస్తారు అనే న్యూస్ వచ్చింది. బట్ టీజర్ డేట్ కూడా మారిందట. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు అని లేటెస్ట్ టాక్. అలాగే టీజర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ఏదేమైనా ఈ మూవీతో విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు అనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. దర్శకుడు గౌతమ్ ఇంతకు ముందు మళ్లీరావా, జెర్సీ చిత్రాలో ఆకట్టుకున్నాడు. ఈ రెండూ కాస్త సెన్సిబుల్ మూవీస్. కానీ విజయ్ తో మాత్రం యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సో.. ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కొడుతుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com