Vijay 69 : విజయ్ 69.. తెలుగు రీమేకా?

Vijay 69 : విజయ్ 69.. తెలుగు రీమేకా?

Vijay 69 : తమిళ దళపతి విజయ్ తన 69వ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు తన చివరి చిత్రంగా ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా లీక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ 69 చిత్రం తెలుగు సూపర్ హిట్ భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

దర్శకుడు హెచ్. వినోద్‌ను ఈ కోణంలో చూడమని విజయ్ సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయ రంగ ప్రవేశం సమయంలో ఒక సందేశాత్మక చిత్రం చేయాలనే ఆయన ఆలోచన. అయితే భగవంత్ కేసరి కథను కోలీవుడ్ ఆడియన్స్‌కు అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి.

సూపర్ హిట్ ప్రేమలు ఫేమ్ మమితా బైజును కీలక పాత్రలో ఎంపిక చేయడం, కాజల్ అగర్వాల్ స్థానంలో పూజా హెగ్డేను తీసుకోవడం, తెలుగులో జాన్ అబ్రహం పాత్రను తమిళంలో బాబీ డియోల్‌కు అప్పగించడం వంటివి ఆసక్తికర అంశాలు.

విజయ్ తన తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'తో తమిళనాడులో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఇతర భాషల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరి లాంటి మాస్ మూవీని ఎంచుకోవడం విజయ్‌కు మేలు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Tags

Next Story