Vijay Devarakonda : సితారతో సెటిల్ అవుతాడా

విజయ్ దేవరకొండ.. టాలెంటెడ్ అయినా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది. గీత గోవిందంతో సెటిల్ అయిపోయాడు. ఆపై వరుసగా సినిమాలన్నీ పోతున్నాయి. ఆ మధ్య ఖుషీతో కొంత వరకూ కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నా ఆ వెంటనే ది ఫ్యామిలీ స్టార్ తో డిజాస్టర్ చూశాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మే 30న విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ సంగీతం చేస్తున్నాడు. ఈ మూవీ గ్యారెంటీ హిట్ అనే కలర్ ఇప్పటికే వచ్చేసింది. అందుకు కారణం నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్.
సితార బ్యానర్ నుంచి సినిమా అంటే కథా బలం ఖచ్చితంగా ఉంటుంది. హిట్ కాకపోయినా విమర్శలు వచ్చే అవకాశాలు అస్సలే ఉండవు. పైగా ఈ బ్యానర్ ఇలాంటి హీరోలకు అదృష్టం తెస్తుంది అనే పేరు కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో ‘ద్వితీయ విఘ్నం’అనే గండం ఉండేది. అంటే ఫస్ట్ మూవీతో హిట్ కొట్టిన దర్శకులు.. సెకండ్ సినిమాతో డిజాస్టర్ చూసేవారు. అలాంటి దర్శకులు సితారలో సినిమా చేస్తే ఈ గండాన్ని ఈజీగా దాటేసేవారు. అందుకు చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు. ఇక డిజాస్టర్స్ లో ఉన్న హీరోలకూ ఈ బ్యానర్ అదృష్టం తెస్తుంది అంటారు. ఈ బ్యానర్ ప్రొడ్యూసర్ నాగవంశీతో పాటు ఆయన పెదనాన్న చినబాబు కథల విషయంలో ఖచ్చితంగా ఉంటారు అని అందరికీ తెలుసు.
అందుకే విజయ్ దేవరకొండ సితార మూవీతో ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడితే ఖచ్చితంగా సెటిల్ అయిపోతాడు. తనపై ఇప్పటికే వ్యక్తిగత దాడి బాగా జరుగుతోంది. ఇలాంటివి ఆగాలంటే బ్లాక్ బస్టర్స్ తో మాత్రమే సాధ్యం అవుతుంది. దిల్ రాజు వంటి నిర్మాత కూడా విజయ్ దేవరకొండకు ఓ మంచి హిట్ ఇవ్వలేకపోయాడు. కానీ సితార బ్యానర్ అతనికి ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయం అనేలా కనిపిస్తోంది. అందుకు కారణం.. ఈ మూవీ టైటిల్ టీజర్ ఈ బుధవారం విడుదలవుతోంది. ఇందులో డైలాగ్స్ కంటే వాయిస్ ఓవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్ ను తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణ్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్యతో చెప్పిస్తున్నారు. అంటే సినిమా రేంజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో అంచనా వేయొచ్చు. ఇలా పెరగడానికి కారణం నిర్మాణ సంస్థ మీద ఉన్న గుడ్ విల్ మాత్రమే. కేవలం విజయ్ మూవీ కావడం వల్ల వాళ్లు వాయిస్ చెప్పడం లేదు. సితార బ్యానర్ మూవీ కాబట్టే ఓకే చెప్పారు అనేది కాదనలేని వాస్తవం. అటు దర్శకుడూ పెద్ద ఫేమ్ ఉన్నవాడేం కాదు కదా. సో.. ఇలాంటి బిగ్గీస్ ను రంగంలోకి దించి విజయ్ మూవీకి తద్వారా విజయ్ కీ ప్యాన్ రేంజ్ లో మరింత ఫేమ్ క్రియేట్ చేయబోతోంది సితార బ్యానర్. ఒకవేళ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా అతను టైర్ 1 హీరోల లిస్ట్ లోకి ఎంటర్ అయిపోతాడు అనేది ఇండస్ట్రీ అంతా చెప్పుకునే మాట. ఆ ఎంట్రీ సితార ద్వారా జరగబోతోందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. సో.. విజయ్ దేవరకొండ సితార బ్యానర్ నుంచి సెటిల్ కాబోతున్నాడు అనుకోవచ్చేమో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com