War 2 : వార్ 2 తెలుగు రైట్స్ ఫైనల్ అయ్యాయా..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తోన్న సినిమా వార్ 2. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఆ బ్యానర్ లోని స్పై వర్స్ లో భాగంగా ఈ మూవీ రూపొందుతోంది. ఆల్రెడీ వార్ మూవీ హిట్ అయింది. ఇప్పుడు వార్ 2 కు ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ యాడ్ అయింది కాబట్టి సౌత్ లో మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇద్దరూ బెస్ట్ డ్యాన్సర్స్ గా తెలుసు. అందుకే ఈ పాట కూడా నాటు నాటు రేంజ్ లో దేశవ్యాప్తంగా మార్మోగిపోతుందని భావిస్తున్నారు.
ఇక ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ ఉంది.అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం తెలుగు హక్కుల కోసమే ఏకంగా 100 కోట్లు అడుగుతున్నారనే టాక్ వచ్చింది. ఈ ఫిగర్ చూసి చాలామంది వెనకడుగు వేశారు. దీంతో ఓ దశలో యశ్ రాజ్ ఫిల్మ్స్ సొంతంగానే సినిమాను విడుదల చేసుకోవాలని ప్రయత్నించింది అనే టాక్ వినిపించింది. బట్ ఫైనల్ గా వార్ 2 రైట్స్ ను నాగవంశీ సొంతం చేసుకున్నాడు అంటున్నారు. నాగవంశీ 80 కోట్ల వద్ద డీల్ సెట్ చేసుకున్నట్టు టాక్. గతంలో చాలామంది ఫ్లాప్ అని భావించిన దేవర చిత్రాన్ని కూడా నాగవంశీయే తీసుకున్నాడు. దేవర అన్ని చోట్లా లాభాలు తెచ్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ దుబాయ్ తీసుకువెళ్లి మరీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు నాగవంశీ. సో.. ఇప్పుడు వార్ 2 కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com