Dil Raju : దిల్ రాజు, మైత్రీ నిర్మాతలపై ఐ.టి సోదాలు

మంగళవారం ఉదయాన్నే తెలుగు సినిమా పరిశ్రమలో షాకింగ్ న్యూస్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ సంస్థ మ్యాంగోపైనా సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు తను నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ తో సంక్రాంతిక పండగకు విడుదల చేశాడు. వీటిలో గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అనిపించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా 100కోట్ల షేర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.దిల్ రాజుతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా ఐ.టి సోదాలు జరగడం టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నాడు.అందుకే అతనికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 తో దేశవ్యాప్తంగా చాలా పెద్ద విజయం అందుకున్నారు. అయతే ఈ విజయంలో మేజర్ షేర్ నార్త్ నుంచి వచ్చింది. నార్త్ ఆల్రెడీ వీళ్లు సినిమాను అమ్మేసిఉన్నారు. కాబట్టి లాభాలు భారీగా ఉన్నా అదే స్థాయిలో నిర్మాతలకూ కలెక్షన్స్ రావు. ఇవే కాక మైత్రీ వారికి వేర్వేరు బిజినెస్ లు కూడా ఉన్నాయి. నిర్మాతలైన యొర్నేని నవన్, వై రవి కిషన్ ల ఇళ్లు ఆఫీస్ లపై సోదాలు కొనసాగుతున్నాయి.
ఇక మ్యాంగో పేరుతో మ్యూజికల్ గా, యూ ట్యూబ్ ఛానల్స్ తోనూ పాపులర్ అయిన సంస్థలపైనా సోదాలు జరుపుతున్నారు అధికారులు. ఈ మ్యాంగో సంస్థ సింగర్ సునిత్ రెండో భర్తది కావడం గమనార్హం. మొత్తంగా ఉదయాన్నే టాలీవుడ్ లో ఈ అనుకోని అతిథులతో అంతా ఓ విధమైన వాతావరణం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com