Harish Shankar : హరీష్ శంకర్ కు ఇది బంపర్ ఆఫర్

ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరున్నా.. ఎక్కువ శాతం రీమేక్స్ తో ఆ ప్రతిభను ఆ స్థాయిలో ప్రదర్శించే అవకాశం లేని దర్శకుడు హరీష్ శంకర్. అద్భుతమైన కథలు చెప్పలేకపోయినా కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా చేయడంలో ముందుంటాడు. బట్ చివరగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మాత్రం దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. హిందీ రైడ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. అటు హరీష్ మార్క్ కానీ ఇటు రవితేజ మార్క్ కానీ కనిపించలేదు. కనీసం ఒరిజినల్ ఫ్లేవర్ అయినా మిగిలిందా అంటే అదీ లేదు. కొన్ని ఫ్లాపులు ఇమేజ్ ను కూడా దెబ్బతీస్తాయి. మిస్టర్ బచ్చన్ చేసింది అదే. ఇక ఈ మూవీలోని స్టెప్పులు ప్రస్తుతం తెలంగాణ మహిళా కమీషన్ ఆగ్రహం వరకూ వెళ్లాయి.
మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ ఖాళీగానే ఉంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలెవరూ హరీష్ ను డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే సడెన్ గా ఓ బంపర్ ఆఫర్ పట్టేశాడుఅనే టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం రామ్ పోతినేనితో సినిమా అనే న్యూస్ వచ్చింది. కానీ అది నిజం కాదు అన్నారు. అయితే ఈ సారి అంతకంటే పెద్ద స్టార్ తోనే సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వస్తోంది. లెజెండ్ నందమూరి బాలకృష్ణతో హరీశ్ శంకర్ సినిమా చేయబోతున్నాడట. ఈ మేరకు బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటున్నారు. ఈ చిత్రాన్ని కర్ణాటక నుంచి హొంబలే ఫిల్మ్స్ తరహాలో భారీ ప్రాజెక్ట్స్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్లు నిర్మిస్తారు అంటున్నారు. ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే ఇది హరీష్ శంకర్ కు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ప్రస్తుతం బాలయ్య అఖండ 2తో బిజీగా ఉన్నాడు. తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా ఉంటుంది. ఆపై బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యలో హరీష్ ప్రాజెక్ట్ ఓకే కావొచ్చు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com