Siddu Jonnalagadda : సిద్దు చేజేతులా మిస్ చేసుకున్నాడా

క్రేజ్ వచ్చినప్పుడే క్యాష్ చేసుకోవాలి అంటారు. అది మనీ రూపంలో అయినా ఇమేజ్ రూపంలో అయినా పెంచుకుంటూ పోవాలి. లేదంటే ఉన్న క్రేజ్ కు ఎసరు వస్తుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ గురించి ఇదే అనుకుంటున్నారు. డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్ మూవీస్ తో తిరుగులేని విజయాలు అందుకున్నాడు.ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ వస్తోన్న తనకు ఈ రెండు సినిమాలు ఇచ్చిన గుర్తింపు ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలంగా అనుకున్నారు. కానీ అలాంటి విజయాల తర్వాత చేసిన జాక్ హ్యాట్రిక్ ఇస్తుందనే భావించారు చాలామంది. బట్ ఈ మూవీ హ్యాట్రిక్ సంగతి పక్కనపెడితే.. డిజాస్టర్ గా మారింది అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
రా ఏజెంట్స్ కథను కామెడీ చేస్తూ ఓ రకంగా ఆ వ్యవస్థనే హేళన చేస్తున్నట్టుగా సాగిన కథనం ఆడియన్స్ కు చిరాకు తెప్పించింది. ఎక్కడా ఆకట్టుకోని కథనంతో మాగ్జిమం బోర్ కొట్టించాడు సిద్ధు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసినా పూర్తిగా సిద్ధు ఆధిపత్యంలానే కనిపిచింది. బేబీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య సైతం రాంగ్ స్టెప్స్ వేస్తోంది. ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో లవ్ మి అనే మూవీతో డిజాస్టర్ అందుకున్న ఈ బేబీ జాక్ తో మరో డిజాస్టర్ ఫేస్ చేస్తోంది.
ఏదేమైనా ఇది సిద్దుకు వేకప్ కాల్ లాంటిది. ముఖ్యంగా స్లాంగ్ విషయంలో. అదే తెలంగాణ యాసను పట్టుకుని ఆగితే అసలుకే మోసం వస్తుంది. వైవిధ్యం చూపించాలి.కథల్లో కొత్తదనం కనిపించాలి. ఇంకా డిజే టిల్లు హ్యాంగోవర్ లోనే ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఇంకా చెబితే ఈ మూవీకి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అదే అసలైన డేంజర్ బెల్. అంటే డిజే టిల్లు ప్రభావం పనిచేయలేదు అనే కదా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com