Allu Arjun : అఫీషియల్.. పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ రూపొందించిన పుష్ప దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ మొదలుపెట్టారు. అనుకున్న దానికంటే కాస్త ఆలస్యం అయినా ఈ సారి ప్యాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేయబోతున్నారు అనేలా ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాక్ ఆఫ్ ద కంట్రీగా నిలిచింది పుష్ప 2. ఇప్పటి వరకూ వచ్చిన పాటలతో పాటు చిన్న గ్లింప్స్ కే బయ్యర్స్ షేక్ అయ్యారు. ఏపిలో నాన్ రాజమౌళి మూవీస్ లో హయ్యొస్ట్ బిజినెస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే నాన్ థియేట్రికల్ గా చూసినా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి.
ఇక ఆగస్ట్ 15న విడుదల చేస్తాం అని చెప్పిన ఈ మూవీని డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ను లాక్ చేశారు. అంత వరకూ చూసిన వాళ్లు మైండ్ బ్లోయింగ్ అంటూ తెగ హడావిడీ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఓ పెద్ద అప్డేట్ ఇచ్చారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న మీడియా పీపుల్ ను హైదరాబాద్ కే రప్పించి మరీ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 ముందు చెప్పినట్టుగా డిసెంబర్ 6న కాక ఒక రోజు ముందుగానే విడుదల చేయబోతున్నాం అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5నే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు.
అంటే అన్ని సినిమాలు వచ్చినట్టుగా శుక్రవారం కాక గురువారం వస్తున్నారన్నమాట. మరి ఈ ఒక్క రోజు ముందుకు రావడం వల్ల ప్రత్యేకంగా వచ్చే ఉపయోగాలేంటో వారికి స్పష్టంగా తెలుసు. మొత్తంగా పుష్ప రాజ్ రూలింగ్ డిసెంబర్ 5 నుంచే ప్రారంభం కాబోతోందన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com