Ram Pothineni : డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టైమ్ వచ్చింది..

Ram Pothineni : డబుల్ ఇస్మార్ట్  ట్రైలర్ టైమ్ వచ్చింది..

ఆగస్ట్ 15న థియేటర్స్ లో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర మూవీకి సీక్వెల్ గా వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ తో రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. అందుకే సాలిడ్ ప్రమోషన్స్ తో సత్తా చాటాలనుకుంటున్నారు. ఆల్రెడి వచ్చిన మూడు పాటలూ ఆకట్టుకున్నాయి. టీజర్ బావుంది. రిలీజ్ కు చాలా రోజుల ముందే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడుపోయాయి. దీంతో పూరీ క్యాంప్ అంతా రెట్టించిన జోష్ లో కనిపిస్తోంది. కాకపోతే నైజాం ఏరియాలో వరంగల్ శ్రీనును సెటిల్ చేసుకోవాల్సిన పని మాత్రం ఉంది. లైగర్ తో అతను పూర్తిగా నష్టపోయాడు కాబట్టి నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నాడు. అతనికి ఏమీ ఇవ్వక్కర్లేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో పంచాయితీ కూడా అయిపోయింది. అయినా ఏదో రకంగా ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఇవన్నీ ఎలా ఉన్నా.. మంచి ప్రమోషన్స్ తో వీలైనంత ఎక్కువ ఆడియన్స్ కు దగ్గరగా వెళ్లాలనుకుంటోంది డబుల్ ఇస్మార్ట్ టీమ్. మరి అలా చేయాలంటే తమ స్ట్రెంత్ ఏంటో తెలియాలి కదా.. అందుకే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 4న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ట్రైలర్ వస్తే మూవీలో ఎంత సత్తా ఉందో ముందుగానే తెలిసిపోతుంది. అలాగని ట్రైలర్ ను బట్టే రిజల్ట్ రాదు. కాకపోతే అంచనాలు పెరుగుతాయి కదా.. అదన్నమాట మేటర్. మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ అన్ని అడ్డంకులూ దాటుకుని ఆడియన్స్ ముందుకు వస్తోన్న టైమ్ లో ట్రైలర్ కోసం ఈగర్ గా చూస్తున్నారు పూరీ అండ్ రామ్ ఫ్యాన్స్.


Tags

Next Story