Jaane Jaan: విజయ్ వర్మ ఒక్క ప్రాజెక్ట్ కు ఎంత వసూలు చేస్తాడంటే..

వర్ధమాన బాలీవుడ్ స్టార్ విజయ్ వర్మ ప్రస్తుతం కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్ తాజా చిత్రం 'జానే జాన్'లో తన పాత్రతో ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హైదరాబాద్‌లో థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, క్రమంగా షార్ట్ ఫిల్మ్‌లలో ముఖ్యమైన పాత్రలు, 'గల్లీ బాయ్', 'డార్లింగ్స్', 'లస్ట్ స్టోరీస్ 2' వంటి ప్రముఖ బాలీవుడ్ సినిమాలలో ముఖ్యమైన పాత్రలను పోషించి విజయ్ వినోద పరిశ్రమలో అతని ప్రయాణం ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది.
'జానే జాన్'.. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఒక మిస్టరీ థ్రిల్లర్.. ఇది సెప్టెంబర్ 21నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతోంది. ఆసక్తికరమైన కథాంశంతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ అసాధారణమైన నటనా నైపుణ్యాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఒక్కో సినిమాకు విజయ్ వర్మ ఫీజు ఎంతంటే..
ఇప్పుడు, ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ సంపాదనపై అభిమానులలో చెప్పుకోదగ్గ క్యూరియాసిటీ ఉంది. విజయ్ వర్మ ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.85 లక్షల నుండి 1 కోటి వరకు పారితోషికం తీసుకుంటాడని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే 'జానే జాన్' కోసం అతని రెమ్యునరేషన్ అదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇక విజయ్ వర్మ సినిమాల విషయాలకొస్తే.. ఆయన 'హోమి అదాజానియా' దర్శకత్వం వహిస్తోన్న మర్డర్ ముబారక్‌లో కనిపించనున్నారు. ఇందులో కునాల్ కెమ్ము, టిస్కా చోప్రా, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్ కూడా నటిస్తున్నారు. ఇది 2024లో విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com