JAAT Collections : కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న జాట్

JAAT Collections  :   కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న జాట్
X

సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన సినిమా జాట్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది. ఫస్ట్ డే నే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో బాలయ్య తరహా కంటెంట్ లా కనిపించినా.. ఈ కంటెంట్ ప్రస్తుతం నార్త్ ఆడియన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి .. జాట్ అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. టాక్ మాత్రమే కాదు.. కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. సన్నీడియోల్ గత సినిమా గదర్ 2 స్థాయిలో లేవు కానీ.. అట్రాక్టివ్ నెంబర్స్ తో దూసుకుపోతోంది జాట్. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్ లోనూ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తోంది.

రణ్ దీప్ హుడా విలన్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్, వినీత్ కుమార్ సింగ్, బబ్లూ పృథ్వీరాజ్, రవిశంకర్ వంటి సౌత్ కు బాగా తెలిసిన ఆర్టిస్ట్ లు ఉండటం విశేషం. అఫ్ కోర్స్ కథ కూడా ఆంధ్రప్రదేశ్ లోని చీరాల ప్రాంతంలో సాగుతుంది. అందుకే ఎక్కువగా తెలుగు ఫ్లేవర్ ఉన్న ఆర్టిస్ట్ లను ఎంచుకున్నాడు దర్శకుడు.

ఇక ఈ చిత్రానికి థమన్ నేపథ్య సంగీతం పెద్ద హైలెట్ గా చెబుతున్నారు ఆడియన్స్. చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయీ చిత్రంలో. అన్నీ కలిసే జాట్ ఆరు రోజుల్లోనే 65 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటుతోంది. ఈ ఏజ్ లో కూడా సన్నీడియోల్ బాక్సాఫీస్ కు తన కెపాసిటీ ఏంటో చూపిస్తున్నాడు అనే చెప్పాలి. నిజానికి ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చేవి అనేవాళ్లూ ఉన్నారు.

Tags

Next Story