BiggBoss: సీజన్ 7లోకి జబర్దస్త్ బ్యూటీ.. భారీ రెమ్యునరేషన్

BiggBoss: సీజన్ 7లోకి జబర్దస్త్ బ్యూటీ.. భారీ రెమ్యునరేషన్
BiggBoss: దాదాపు ఆరేళ్ల క్రితం తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి, ఈ పాపులర్ యాంకర్‌ రష్మీ గౌతమ్ కి అవకాశం వస్తూనే ఉంది.

BiggBoss: దాదాపు ఆరేళ్ల క్రితం తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి, ఈ పాపులర్ యాంకర్‌ రష్మీ గౌతమ్ కి అవకాశం వస్తూనే ఉంది.అయితే రెమ్యునరేషన్ చాలకో.. లేదా మరో ప్రోగ్రాంతో బిజీగా ఉందో కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

అయితే ముందు ఉన్నంత ఆసక్తి ఇప్పుడు లేదు. బిగ్ బాస్ చూసే వాళ్లు చాలా వరకు తగ్గిపోయారు. దాంతో షోని ఎలా అయినా పాపులర్ చేయాలని కంకణం కట్టుకుంది సదరు ఛానల్.. దాంతో ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న యాంకర్ రష్మీని మరోసారి బతిమాలుతోంది..

ఈసారి అడిగినంత ఇస్తాం అని ఆఫర్ ఇచ్చింది. నిజానికి కొద్దిగా పాపులారిటీ ఉన్నవాళ్లకి వారానికి రూ.౩ లక్షలవరకు ఇస్తారట.. మిగిలిన వారికి వారానికి లక్షరూపాయల చొప్పున ఇస్తారట. రష్మీకి అయితే వారానికి రూ.7లక్షల వరకు ముట్టచెప్పాల్సి వస్తుంది.

ఈ లెక్కన ఆమె హౌస్ లో చివరి వరకు ఉంటే మొత్తం కోటి అవుతుంది. మరి పడిపోతున్న రేటింగ్ ను పైకి లేపాలంటే ఆ మాత్రం చెల్లించుకోవాల్సిందే.. చూడాలి రష్మీ వస్తే రేటింగ్ పెరుగుతుందో లేదో. ఇప్పటికే రెండు సార్లు నిరాకరించిన రష్మీ ఇప్పుడు వస్తుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story