Jabardasth Appa Rao: పరోక్షంగా అవమానించారు అందుకే తప్పుకున్నా: అప్పారావు

Jabardasth Appa Rao: జబర్దస్త్ అనే ఒక్క కామెడీ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా గుర్తింపు రానివారికి, కొత్తగా కమెడియన్లుగా కెరీర్ ప్రారంభించాలి అనుకున్నవారికి జబర్దస్త్ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌గా నిలిచింది. అయితే ఇందులో మొదటి నుండి ఉన్న సీనియర్ కమెడియన్ అప్పారావు.. ఇటీవల కనిపించడం లేదు. దీనికి కారణాల ఏంటో ఇటీవల బయటపెట్టాడు.
జబర్దస్త్‌లో దాదాపు 7 నుండి 8 సంవత్సరాలుగా చేస్తున్నాడు అప్పారావు. తను వేసిన పలు గెటప్‌లు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తు్న్నాయి. అప్పారావు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత యాజమాన్యం తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షోకు కాస్త దూరంగా పెట్టిందని అన్నారు అప్పారావు. ఇక అప్పటినుండి మళ్లీ వారి నుండి పిలుపు రాలేదని తెలిపారు.
చెప్పుడు మాటలు విని తన పేరును హోల్డ్‌లో పెట్టారన్నారు అప్పారావు. చివరిగా స్కిట్స్‌లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశానన్నారు. ఒకప్పుడు టీమ్ లీడర్‌గా చేసిన తనకు మెల్లగా ఒక కంటెస్టెంట్‌కు ఇచ్చే ప్రాధాన్యత కూడా ఇవ్వలేదన్నారు. అంతే కాకుండా పరోక్షంగా అవమానించారు కాబట్టి షో నుండి తప్పుకోవాల్సి వచ్చింది అని స్పష్టం చేశారు. వెళ్లిపోయేటప్పుడు కూడా కనీసం అడగలేదని వాపోయారు. ప్రస్తుతం వేరే కామెడీ షోలో చేస్తున్న అప్పారావు.. దానికి డబుల్ పేమెంట్ అందుకుంటున్నట్టు తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com