ఆ టైంలో చనిపోదాం అనుకున్నా.. అప్పుడు గెటప్ శ్రీను వచ్చి..

ఆ టైంలో చనిపోదాం అనుకున్నా.. అప్పుడు గెటప్ శ్రీను వచ్చి..
హౌస్ లో ఉన్నప్పుడు తానూ చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాని, తనకి ఇప్పుడు బిగ్ బాస్ లేకపోతే జీవితమే లేదంటూ కామెంట్స్ చేస్తూ పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు.

బిగ్ బాస్ హౌస్ లో అందరిని బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు జబర్దస్త్ అవినాష్. అయితే హౌస్ లో ఉన్నప్పుడు తానూ చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాని, తనకి ఇప్పుడు బిగ్ బాస్ లేకపోతే జీవితమే లేదంటూ కామెంట్స్ చేస్తూ పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు.. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అవినాష్ తానూ ఎదురుకున్న ఆర్ధిక పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు.

"గత ఏడాది సెప్టెంబర్‌లో నేను ఇళ్లు తీసుకున్నా.. ఇందులో కొంత అమౌంట్ అనుకోని ఇంకొంత అమౌంట్ లోన్ పెట్టాను.. ఇల్లు కోసం అడ్వాన్సు కూడా ఇచ్చేశా.. అయితే సరిగ్గా అదే సమయంలో మా అమ్మ, నాన్నలకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. నేను అనుకున్న డబ్బును అమ్మనాన్నల ఆపరేషన్ కోసం పక్కన పెట్టేసాను. అడ్వాన్సు ఇచ్చేయడంతో వాళ్లు ఫోన్ చేసి ఇళ్లు తీసుకుంటారా? లేకపోతే ఇళ్ళు వేరేవాళ్ళకి ఇచ్చేయలా అని అడగడంతో వేరే దారిలేకా అప్పు చేయాల్సి వచ్చింది. అలా ఇళ్ళు తీసుకొని మార్చి మొదటి వారంలో గృహప్రవేశం చేసుకున్నా.. ఇక మార్చి మూడో వారం నుంచి లాక్ డౌన్ మొదలైంది.

జబర్దస్త్, ఈవెంట్స్, షోలు ఉన్నాయనే దైర్యంతో అప్పు చేశా.. తీరా లాక్ డౌన్ రావడంతో అన్నీ ఆగిపోయాయి. ఇంట్లోకి సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒకపక్కా అప్పు ఇచ్చిన వాళ్ళు ఫోన్లు చేయడం.. పోనీ ఫ్రెండ్స్ ని అడుగుదామా అంటే మొహమాటం. ఎక్కడ ఫ్రెండ్ షిప్ చెడిపోతుందనే భయం. ఈ సమయంలో మార్చి 20న బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చింది. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌ని వదిలి రానని చెప్పాను. ఆ తర్వాత ఏప్రిల్, మేలో కూడా చేశారు. రాననే చెప్పాను. ఈ టైంలో అప్పుల వాళ్ళ దగ్గరినుంచి ఫోన్స్ .. కొన్న ఇంటిపై నుంచి దూకి చచ్చిపోదాం అనుకున్నా. జీవితంలో రెండు సార్లు చనిపోదామని అనుకున్నా.. అందులో ఇది ఒకటి..

అలాంటి సమయంలో గెటప్ శ్రీనుకి ఫోన్ చేశా.. చాలా దైర్యం చెప్పాడు. అప్పుడు బిగ్ బాస్ కి వచ్చాను. బిగ్ బాస్ లోకి వెళ్లి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఫేస్ చేయొచ్చని నేర్చుకున్నాను. ఇప్పుడు నా అప్పులన్నీ తీరిపోయాయి. చాలా సంతోషంగా ఉన్నాను" అని అవినాష్ చెప్పుకొచ్చాడు.

Tags

Next Story