చనిపోతానని డాక్టర్లు చెప్పారు..నన్ను బతికించింది వీళ్లే..రోజా ముందు జీవన్ కన్నీరుమున్నీరు

Extra Jabardasth Jeevan File Photo
Extra Jabardasth Jeevan: బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షోలోని కమెడియన్స్ వినూత్నమైన కాన్సెప్టులతో వినోదం పంచడమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి ఆర్టిస్టుని కాపాడుకుంటారని నిరూపించుకున్నారు.
జబర్దస్త్‌తో బుల్లితెరకు పరిచయమైన కమెడియన్ జీవన్ ఒకరు.. పంచ్ డైలాగ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జీవన్ ఈ షోలో కనిపించడం మానేశారు. అనారోగ్య సమస్యలతో హాస్పటల్‌లో చేరిన జీవన్.. కొన్నాళ్లపాటు ఐసీయూలోనే ఉన్నాడు. దీంతో ఈయన పరిస్థితి మరింత ఘోరంగా మారడంతో జబర్దస్త్ వేదిక మొత్తం ఎంతో బాధపడింది. అయితే అదిరే అభి చొరవ తీసుకుని జబర్దస్త్ కమెడియన్ల అందరి సాయంతో జీవన్‌ని రక్షించుకున్నారు.
ఇక జీవన్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. తిరిగి కోలుకున్నాక జీవన్ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో జీవన్ కనిపించాడు. అందులో మాట్లాడిన జీవన్ భావోద్వేగానికి గురయ్యాడు. జబర్దస్త్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. జడ్జి రోజా ముందు తన బాధలు చెప్పుకున్నాడు.
ఈ రోజు తను అందరి ముందు ఇలా బతికి ఉన్నానంటే దానికి కారణం జబర్దస్త్ టీం లీడర్స్ అంటూ వాళ్ళ వల్లే ఇలా ఉన్నానని వీళ్లంతా లేకపోతే చనిపోయేవాడిని అంటూ ఎమోషనల్ అయ్యాడు.
రెండు సార్లు తన పరిస్థితి విషమించిందని, నేను బతకనని డాక్టర్లు చెప్పేశారు.. నాకు చిన్న బాబు మేడమ్.. " అమ్మ ఏడుస్తూనే ఉంది. ఇంజక్షన్స్ చేస్తున్నా బాడీ సహకరించలేదు. డాక్టర్లు బతకడం కష్టమని చెప్పేస్తే వీళ్లంతా నన్ను కాపాడారు మేడమ్" అని చెప్పుకొచ్చాడు జీవన్. దీనిపై స్పందించిన గెటప్ శీను జబర్దస్త్ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా మేం అంతా అండగా ఉంటామని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com