స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బుల్లితెరపై దూసుకుపోతున్న మెగా షో జబర్దస్త్. ఈ షో ఎంతో మంది కమెడియన్లు పరిచయం చేసింది.. అనసూయ యాంకర్ గా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. హైపర్‌ఆది, అభి, వెంకీ-తాగుబోతు రమేశ్, చలాకీ చంటి టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ జబర్థస్త్ టీమ్ లీడర్లలో వెంకీ ఒకరు. వెంకీ మంకీస్ పేరుతో ఈ టీమ్ చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.
అయితే ఈ షో వచ్చే వారం ప్రోమో రిలీజ్ అయింది. వెంకీ కన్నీరు పెట్టుకోవడంతో ఆశ్చర్యపోయారు. మనో ఏం వెంకీ ఏమైంది అని అడగగా 'చేసేది నేను.. చేయించింది నేను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.అయితే అసలేం జరిగిందో తెలియాలంటే మాత్రం వచ్చే జబర్దస్త్ షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. వెంకీ మంకీస్ టీమ్ నుంచి పేరు తెచ్చుకున్న జీవన్ ప్రస్తుతం టీమ్ లీడర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం వెంకీ మంకీస్ టీమ్ లో తాగుబోతు రమేష్ కూడా చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com