ఇమ్మానుయేల్ కి వేరే అమ్మాయితో పెళ్లి .. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న వర్ష..!

ఇమ్మానుయేల్ కి వేరే అమ్మాయితో పెళ్లి .. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న వర్ష..!
Jabardasth varsha : బుల్లితెర పైన ఫుల్ పాపులారిటీ ఉన్న షోలలో జబర్దస్త్ ఒకటి.. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ ఫుల్ సక్సెస్‌‌తో కొనసాగుతుంది.

Jabardasth varsha : బుల్లితెర పైన ఫుల్ పాపులారిటీ ఉన్న షోలలో జబర్దస్త్ ఒకటి.. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ ఫుల్ సక్సెస్‌‌తో కొనసాగుతుంది. అయితే ఈ షోలో రష్మీ- సుదీర్ జోడి లాగే ఇమ్మానుయేల్- వర్ష జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. చూడటానికి నలుపు, తెలుపు కాంబినేషన్ అయినప్పటికీ ఆడియన్స్‌‌లో ఈ జంటకి ఫుల్ క్రేజ్ ఉంది. వీలు చిక్కినప్పుడల్లా ఈ జంట ఒకరిపైన ఒకరు తమ ఫీలింగ్స్‌‌‌ని ఎక్స్‌‌ప్రెస్ చేస్తూనే ఉంది. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో వర్ష మాటలు విన్న ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

తాజాగా విడుదలైన ప్రోమోలో వర్ష, ఇమాన్యూయేల్ ప్రేమించుకుంటారు కానీ పెళ్లి చేసుకోలేకపోతారు. వర్షను పెళ్లాడాల్సిన ఇమ్మానుయేల్ అనుకోని పరిస్థితుల్లో వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాడు. దీంతో వర్ష తెగ ఫీలై పోతుంది. అయితే ఒకవేళ నిజంగా ఇమ్మూకు వేరే వాళ్లతో పెళ్లైతే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నీకు ఎలా ఉంటుందని స్కిట్ అయ్యాక రోజా వర్షని అడిగింది. దీనిపైన వర్ష స్పందిస్తూ ఎమోషనల్ అయింది.

ప్రతి అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటుంది. మనం ఉండాలని అనుకున్న ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోవడం చాలా కష్టం అంటూ వర్ష ఎమోషనల్ అవ్వడం చూసి షాకైన ఇమ్మూ.. ఆ తర్వాత బాధపడుతూ కనిపించాడు. దీనితో వర్ష- ఇమ్మానుయేల్ మధ్య రిలేషన్ కన్ఫర్మ్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Tags

Next Story