సినిమా

బిగ్ బాస్‌కు వెళ్తున్న జబర్దస్త్ బ్యూటీ

Jabardasth: జబర్దస్త్ బ్యూటీకి బిగ్ బాస్ ఛాన్స్

బిగ్ బాస్‌కు వెళ్తున్న జబర్దస్త్ బ్యూటీ
X

Jabardasth: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్(bigg boss) నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, త్వరలోనే ఐదోది కూడా మొదలవబోతుంది. తెలుగులోకి బిగ్ బాస్ షో మొదలైన సమయంలో దీన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ షోను ప్రేక్షకులే సూపర్ హిట్ చేశారు. అయితే బిగ్‎బాస్‎లో వచ్చే కంటెస్టెంట్లకు వచ్చే ఫాలోయింగ్ మాములుగా ఉండదు. బిగ్ బాస్ షో ద్వారా జనాల్లో వారి మంచి గుర్తింపు వస్తుంది. ఇక త్వరలోనే 5వ సీజన్ కూడా మొదలవబోతుంది. ఇటీవలే బిగ్‌బాస్‌-5 లోగో, ప్రోమో విడుదల చేసింది స్టార్ మా చానల్. దీంతో బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు వార్తలు, లీకులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి జబర్దస్త్ కమెడీయన్స్ వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి ముక్కు అవినాష్ వెళ్లిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న వర్ష.. ఇప్పుడు బిగ్ బాస్ ఇంటికి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ షోలో భాస్కర్ సహా చాలా మంది టీమ్స్‌లో కీలక టీమ్ మెంబర్‌గా మారిపోయింది వర్ష. ఇప్పటికే బిగ్ బాస్ ఎంట్రీపై ప్రేమకావాలి మూవీ ఫేమ్ ఇషాచావ్లా , నటి సురేఖా వాణి, యాంక‌ర్ ర‌వి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


వర్ష అందంతో పాటు కామెడీ టైమింగ్‌తోనూ అదరగొడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె బిగ్ బాస్ ఇంటికి వెళ్లబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం ఈమెకు భారీగానే పారితోషికం ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జబర్దస్త్ నుంచి బిగ్ బాస్‌కు వెళ్లాలంటే ఇక్కడ మొత్తం వదిలేసి వెళ్లిపోవాలి. ముక్కు అవినాష్ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడక్కడే స్టార్ మాలో ఉన్నాడు. కానీ మళ్లీ మల్లెమాలకు రాలేకపోయాడు.వర్ష కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES