Jabardasth Vinod : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్.. ఆయన భార్య ఎవరంటే..?

Jabardasth Vinod : జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో వినోద్ ఒకరు. లేడీ గెటప్స్ తో బాగా క్లిక్ అయ్యాడు వినోద్.. చీర కట్టి బొట్టు పెట్టుకుంటే అచ్చం అమ్మాయిలాగే ఉంటాడు వినోద్.. మొదట్లో చాలా మంది అతన్నీ అమ్మాయనే అనుకున్నారు కూడా.. ఇదిలా ఉంటే వినోద్ ఇప్పుడు ఓ ఇంటివాడు అయ్యాడు. తన భార్యను కూడా యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేశాడు వినోద్. 'వినోద్‌తో వినోదం' అనే పేరుతో యూట్యూబ్‌లో ఓ కొత్త ఛానెల్ ప్రారంభించాడు. ఇందులో మొదటి వీడియో తన పెళ్లి గురించే తీశారు. పెళ్లి వివరాలను చెప్పడంతో పాటు భార్యను కూడా అందరికీ పరిచయం చేశారు. తన మేనత్త కూతురు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు వినోద్.. ఆమె స్వస్థలం కడప. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com