Jack Movie Trailer : ఇది ‘జాక్’తో ఆగే కథ కాదట

Jack Movie Trailer :  ఇది ‘జాక్’తో ఆగే కథ కాదట
X

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా జాక్ ట్రైలర్ విడుదలైంది. మంచి ఫన్ తో పాటు ఓ ఇన్వెస్టిగేటివ్ కంటెంట్ తోనూ కనిపిస్తోంది. అతను ఇండియన్ ఏజెంట్ గా నటించాడని అర్థమైంది. అలాగ ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ మరో ఏజెన్సీగా ఒకే కేస్ కోసం పనిచేయడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, సాహసాలు, వినోదం, ప్రేమ వంటి అన్ని అంశాలూ మిక్స్ అయి సిద్ధును డిజే టిల్లు జోన్ నుంచి బయటకు తెచ్చేలా కనిపిస్తున్నాయి. మామూలుగా అతను అంతకు ముందు చాలా సినిమాలు చేసినా డిజే టిల్లు ఇంపాక్ట్ కెరీర్ మొత్తం ఉండేలా కనిపించింది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంపాక్ట్ ను పోగొట్టుకోవాలి. లేదంటే మూస హీరో అయిపోతాడు.

ఇక జాక్ కు సంబంధించి వినిపిస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఇది ఒకే పార్ట్ తో ఆగిపోవడం లేదు. జాక్ మరో రెండు భాగాలున్నాయట. అంటే జాక్ ఈ నెల 10న విడుదలవుతోంది. దీనికి సీక్వెల్ గా ‘జాక్ ప్రో’ అనే మరో పార్ట్ ఆ తర్వాత ‘జాక్ ప్రో మ్యాక్స్’ అంటూ మూడు భాగాలు వస్తాయని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అఫీషియల్ గానే చెప్పారు. నిజానికి ఈ తరహా చిత్రాలకు ఆ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏజెంట్స్ అంటే ఒక కేస్ అయిపోగానే మరో కేస్ కు వెళ్లొచ్చు. ఓ టెర్రరిస్ట్ ను పట్టుకున్న తర్వాత మరో టెర్రరిస్ట్ కోసం వెళ్లొచ్చు. అందుకే మూడు భాగాలు అంటున్నారు. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు వస్తోన్న జాక్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటాయి అనుకోవచ్చు. జాక్ హిట్ అయితే ప్రో.. ప్రో హిట్ అయితే మ్యాక్స్ అలా అన్నమాట.

Tags

Next Story