రూ.175 కోట్లతో ఇల్లు.. ప్రియుడితో కలిసి..

రూ.175 కోట్లతో ఇల్లు.. ప్రియుడితో కలిసి..
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది. బాలీవుడ్ బ్యూటీస్ అనుకున్నారంటే అందమైన ఇల్లు కోట్లయినా కొనేయరూ.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది. బాలీవుడ్ బ్యూటీస్ అనుకున్నారంటే అందమైన ఇల్లు కోట్లయినా కొనేయరూ. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ వార్తల్లో ఉంచడానికి ఇష్టపడరు. ఆమె తన డేటింగ్ జీవితం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ తాజాగా ఆమె తన ప్రియుడితో కలిసి సముద్రం ఒడ్డున ఉన్న భారీ బంగ్లాలో నివసించబోతున్నట్లు పేర్కొంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గత కొంతకాలంగా తమ కలల సౌధం వేటలో ఉన్నారు. చివరికి ఆమెకు ఓ అందమైన అపార్ట్‌మెంట్ కనిపించింది. దాని ఖరీదు జస్ట్ రూ.175 కోట్లేనట.

జాక్వెలిన్ ఆమె బాయ్‌ఫ్రైండ్‌ అయిన ఒక పారిశ్రామికవేత్తతో గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉంది. ఈ జంట కొంతకాలంగా కలిసి జీవించాలని అనుకుంటున్నారు. అందుకోసం అనువైన ఇంటిని ఎంపిక చేసుకున్నారు. వీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు జుహులోని ఒక ప్రధాన ప్రదేశంలో ఉంది. కాగా, జాక్వెలిన్ రోహిత్ శెట్టి సిర్కస్ మరియు అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే చిత్రంలో కనిపించనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మిసెస్ సీరియల్ కిల్లర్‌లో జాక్వెలిన్ చివరిసారిగా తెరపై కనిపించింది.

Tags

Read MoreRead Less
Next Story