Jagapathi Babu : నాలాంటి వాడు దానికి పనికిరాడు : జగపతి బాబు

Jagapathi Babu : జగ్గూభాయి తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం హాట్సార్‌లో స్ట్రీమ్ అవుతున్న పరంపర సీజన్ 2లో జగపతి బాబు పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరీర్ స్టా్ర్టింగ్‌లో కన్నా సెకండ్ ఇన్నింగ్స్‌లోనే జగ్గూభాయి దూసుకుపోతున్నారు. వరుస అవకాశాలు ఆయన వెంటపడుతున్నాయి.
పరంపర వెబ్ సిరీస్ మొత్తం రివెంజ్ పొలిటికల్ డ్రామా. సీరిస్ పై చర్చ జరుగుతుండగా.. మీరు రాజకీయాల్లోకి వస్తారా అని ఇంటర్యూ చేసే అతను అడిగారు. దానికి జగ్గూభాయి సమాధానం చెబుతూ.. సినిమా ఒక మాయ అయితే.. రాజకీయం మాయాలోకం.. ఆ మాయాలోకంలోకి నేను వెళ్లదలచుకోలేదు.
నలుగురితో సరిగా మాట్లాడ్డం కూడా నాకు రాదు. రాజకీయాల్లోకి వెళ్లి వేల లక్షల మందితో ఏం మాట్లాడుతా. నాలాంటి వాడు పాలిటిక్స్‌కు పనికిరాడు కాబట్టి నేను రాజకీయాల్లోకి రావడం ఇంపాజిబుల్ అన్నారు జగపతిబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com