Jahnvi kapoor : పెద్ది సెట్స్ లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్

Jahnvi kapoor :  పెద్ది సెట్స్ లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తోన్న సినిమా ఇది. క్రికెట్, రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న సినిమా అని ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య, గేమ్ ఛేంజర్ తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ మూవీ ఆ రెండు డిజాస్టర్స్ మర్చిపోయేంత పెద్ద విజయం సాధిస్తుందనే దీమాతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రంలో కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు మరో కీ రోల్ చేస్తున్నాడు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆ మధ్య ఓ షెడ్యూల్ లో ఒకట్రెండు రోజులు మాత్రమే షూటింగ్ లో పార్టిసిపేట్ చేసింది. అయితే తాజాగా మొదలైన కొత్త షెడ్యూల్ లో తనపై చాలా సీన్స్ చిత్రీకరించబోతున్నారు. ఈ మేరకు అమ్మడు షూటింగ్ లో జాయిన్ అయింది.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ లతో జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ చేస్తే చూడాలనుకుంటున్నానని చిరంజీవి చాలాసార్లు చెప్పాడు. అందుకే జాన్వీ ముందుగా రామ్ చరణ్ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందనుకున్నారు. బట్ తనకు ఆ ఛాన్స్ ఎన్టీఆర్ దేవరతో వచ్చింది. ఇది తన సెకండ్ తెలుగు మూవీ. ప్యాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతోన్న పెద్దితో జాన్వీకి మంచి బ్లాక్ బస్టర్ పడుతుందనుకుంటున్నారు. దేవరలో తన పాత్ర పరిమితంగానే కనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రే అంటున్నారు.

Tags

Next Story