Jahnvi Kapoor : మత్తెక్కించే కళ్లు.. మైమరపించే పరువాలు

అందానికే అసూయ పుట్టించిన సోయగం వారసురాలు అంటే ఎలా ఉంటుంది.. ఇదుగో ఇలా ఉంటుంది అనిపిస్తుంది జాన్వీ కపూర్ ప్రతిసారి. సోషల్ మీడియాను హీటెక్కిస్తూ నిత్యం అందాలారబోతతో అదరగొడుతూ ఉంటుంది. ఓ వైపు సినిమాలు చేస్తున్నా.. ఏదో ఆఫర్స్ లేని బ్యూటీలా ఇలా అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా దేవరతో సౌత్ కి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేకెత్తిస్తూ ఇదుగో ఇలా హాట్ హాట్ సోయగాలతో కవ్విస్తోంది. పూల పూల లెహంగాలో ఫోజులు ఇచ్చింది జాన్వీ.
సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తోంది. దేవరలో తన పాత్రను సరిగా డిజైన్ చేయలేదు. బుచ్చిబాబు మూవీలో ఎలా ఉంటుందో కానీ.. బాలీవుడ్ లో కూడా ఒకే ఒక్క ప్రాజెక్ట్ తన చేతిలో ఉంది. అందర్లా హడావిడీగా కాక తను కాస్త ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా దేవర కాకుండా బాలీవుడ్ లో చేసిన మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ మూవీస్ లో తన నటనకు ప్రశంసలు దక్కాయి. మొత్తంగా ఇలా నిరంతరం ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉందీ బ్యూటీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com