Jai Bheem: తప్పు సూర్యది కాదు.. నాది..: 'జై భీమ్' దర్శకుడు
Jai Bheem: ఈ చిత్రానికి సంబంధించి ఒక వివాదం తెరపైకి వచ్చింది. దానికి నటుడు సూర్యని టార్గెట్ చేస్తున్నారు.

Jai Bheem: సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'జైభీమ్' విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా మాట్లాడుకున్న చిత్రం, ప్రతి ఒక్కరినీ కదిలించిన చిత్రంగా జైభీమ్‌ని చెప్పుకోవాలి.
ఒక వాస్తవ కథను హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు జ్ఞానవేల్. కథను నడిపించడంలో దర్శకుని ప్రతిభతో పాటు, నటీనటుల పాత్ర కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వివాదం తెరపైకి వచ్చింది.
దానికి నటుడు సూర్యని టార్గెట్ చేస్తున్నారు విమర్శకులు. కానీ దర్శకుడిగా ఆ బాధ్యత తనదని చెబుతున్నారు జ్ఞానవేల్. తమిళనాడుకు చెందిన వన్నియార్లు ఈ చిత్రంలో తమ వర్గం వారిని కించపరించే విధంగా కొన్ని దృశ్యాలు ఉన్నాయని వివాదం లేవనెత్తారు.
సంఘం సభ్యులు అన్భుమణి రామదాస్ ఈ సన్నివేశాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు సూర్యని తప్పుపడుతూ విమర్శలు చేశారు. దీంతో వివాదం ముదరక ముందే సంబంధిత సీన్లో మార్పులు చేశామని దర్శకుడు వివరించారు.
కావాలని సూర్యను టార్గెట్ చేయడం భావ్యం కాదని అన్నారు. అతడు ఓ నటుడిగా, నిర్మాతగా గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల్ని వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు.. ఓ వ్యక్తినో, ఓ వర్గాన్నో కించపరిచే ఉద్దేశంతో ఈ సినిమాని తెరకెక్కించలేదు. ఈ చిత్రం వల్ల బాధపడిన వారిని క్షమించమని కోరుతున్నాను అని ఆయన అన్నారు.
RELATED STORIES
DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్‌లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMTChiru Pawan: మెగా బ్రదర్స్ పుట్టినరోజులకు ఫ్యాన్స్‌కు స్పెషల్...
13 Aug 2022 3:30 PM GMTAllu Arjun: అల్లు అర్జున్ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ధర ఎంతంటే..?
13 Aug 2022 2:15 PM GMTMohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..
13 Aug 2022 1:46 PM GMTProducers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTTamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్‌తో పాటు..
13 Aug 2022 12:25 PM GMT