jai Bhim : 'జై భీమ్' కి మూడు ఇంటర్నేషనల్ అవార్డులు..

Jai Bhim : తమిళ్ స్టార్ హీరో సూర్య మెయిన్ లీడ్‌లో,జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జైభీమ్'.. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది నవంబర్ 2 న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. సినీ విమర్శకుల చేత ప్రశంసలు కూడా అందుకుంది.
కేవలం మౌత్ టాక్‌తోనే జై భీమ్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సంపాదించింది. ఇప్పుడీ సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా మూడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా సూర్య, ఉత్తమ నటిగా లిజోమాల్ జోస్‌ను అవార్డులు వరించాయి. అంతేకాకుండా ఉత్తమ చిత్రంగానూ ఈ మూవీ నిలిచింది.
ఇండియన్ సినిమా ఇంతటి ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా 'జై భీమ్' టీంకి పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు 'జై భీమ్' సినిమాకి ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB నుంచి ఏకంగా IMDBలో 9.6/10 రేటింగ్ దక్కించుకుంది. 53K Likes తో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.
#JaiBhim had won Best Film, Best Actor @Suriya_offl & Best Actress @jose_lijomol at the Noida International Film Festival 2022! #Jyotika @tjgnan @rajsekarpandian @RSeanRoldan @2D_ENTPVTLTD @PrimeVideoIN @SonyMusicSouth @prakashraaj @srkathiir @KKadhirr_artdir @philoedit pic.twitter.com/SuRP1o4ztT
— BA Raju's Team (@baraju_SuperHit) January 24, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com