Jailer 2 Movie : ఓటిటిలో భారీ ధరకు రజినీకాంత్ జైలర్ 2

కనీ విని ఎరుగని ధరకు జైలర్ 2 మూవీ ఓటిటిలోకి రాబోతోంది. ఈ మేరకు ఓటిటి బ్యానర్ అగ్రమెంట్ కూడా పూర్తయింది. మామూలుగా ఇప్పటి వరకు ఏ తమిళ్ స్టార్ హీరో సినిమాకు కూడా అంత ధర పెట్టలేదు. రజినీకాంత్ లాంటి స్టార్.. అదీ ఈ ఏజ్ లో ఆ ఫీట్ సాధించాడు అంటే మామూలు విషయం కాదు. ఓ రకంగా ఇది ఆల్ టైమ్ తమిళ్ మూవీస్ ఓటిటి రైట్స్ గా చెప్పొచ్చు. జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రజినీకాంత్. జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లు ఈ మూవీలో కేమియో రోల్స్ లో నటించారు. అయినా వీరిలో శివరాజ్ కుమార్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జైలర్ 2 లో కూడా ఈ ఫీట్ రిపీట్ అవుతుంది. కాకపోతే ఈ మూవీలో బాలకృష్ణ చేస్తున్నాడు అనే టాక్ వినిపించింది. బట్ అది కేవలం రూమర్. అలాగే విజయ్ సేతుపతి, షారుఖ్ ఖాన్ లు కూడా నటిస్తున్నారు అనే టాక్ ను సైతం జస్ట్ గాసిప్స్ గానే కొట్టి పడేసింది మూవీ టీమ్.
ఇక జైలర్ 2లో మరోసారి రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తుంది. యోగిబాబు, మిర్నా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరితో పాటు విద్యాబాలన్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఇది జస్ట్ రూమరా లేదా అనేది తెలియాల్సి ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. చాలా వేగంగానే చిత్రీకరణ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక జైలర్ 2 ను అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఈ మూవీకి ఏకంగా 160 కోట్లతో ఓటిటి రైట్స్ తీసుకుంది. 160 కోట్లు అంటే మాటలు కాదు. తెలుగు నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ల మూవీస్ కే కేవలం 120 కోట్ల వరకు చెల్లిస్తున్నాయి ఓటిటి సంస్థలు. అలాంటిది సూపర్ స్టార్ మూవీ అంటే ఈ రేంజ్ లో ఉండటం మాత్రం అత్యంత అరుదైన విషయమే. ఏదేమైనా రజినీకాంత్ మూవీ అంటే అదుర్స్ కదూ.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
