NTR : ఎన్టీఆర్ తో జైలర్ డైరెక్టర్.. నిర్మాత ఏమన్నాడంటే

NTR :  ఎన్టీఆర్ తో జైలర్ డైరెక్టర్.. నిర్మాత ఏమన్నాడంటే
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ లో కొన్నాళ్లుగా రూమర్ లా వినిపించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. నెల్సన్ యాక్షన్ మూవీస్ ను బాగా హ్యాండిల్ చేస్తాడు. మాస్ పల్స్ తెలిసిన వాడు అనే పేరుంది. ముఖ్యంగా అతని సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ ను తలపిస్తాయి. ఇక రీసెంట్ గా జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ఏజ్ లో రజినీకాంత్ కు కెరీర్ బెస్ట్ హిట్ అనేలాంటి మూవీ ఇచ్చాడు. అఫ్ కోర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి టాప్ స్టార్స్ ను కూడా తీసుకున్నాడు. అదీ ప్లస్ అయింది. దీనికి అనిరుధ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ అంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టే అనుకున్నారంతా. కానీ ఈ విషయాన్ని ఎవరూ కన్ఫార్మ్ చేయలేదు.

తాజాగా నిర్మాత నాగవంశీ కన్ఫార్మ్ చేశాడు. నెల్సన్ తో ఎన్టీఆర్ మూవీ తమ బ్యానర్ లోనే ఉంటుందని చెప్పాడు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఈ టైమ్ స్టార్ట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేను అన్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 మూవీ చేస్తున్నాడు. ఇది 2025 ఇండిపెండెన్స్ డే కు విడుదలవుతుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నెల్సన్ మూవీ ఉంటుంది. అలాగే ఈ టైమ్ లో నెల్సన్ కూడా జైలర్ 2 చేయబోతున్నాడు. అతను అది కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ ఎన్టీఆర్ కు వినిపించిన లైన్ ను పర్ఫెక్ట్ గా డెవలప్ చేసుకుని హీరోను మెప్పిస్తే 2026లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. లేదంటే ఎన్టీఆర్ కు దేవర 2 కూడా ఉంది కదా. సో.. జైలర్ డైరెక్టర్ తో మన యంగ్ టైగర్ మూవీ ఉంది. కాకపోతే ఎప్పుడు అనే క్లారిటీ రావడానికి కాస్త టైమ్ పడుతుంది.

Tags

Next Story