ఆగస్ట్ 10 విడుదల.. అప్పుడే మొదటి సమీక్ష

ఆగస్ట్ 10 విడుదల.. అప్పుడే మొదటి సమీక్ష
రజనీ కాంత్, తమన్నా భాటియా నటించిన జైలర్ ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీ కాంత్, తమన్నా భాటియా నటించిన జైలర్ ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.రజనీకాంత్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అప్పుడే మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ రజినీ అభిమానులకు ఈ చిత్రం సంతోషకరమైన అనుభవం ఇస్తుందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "జైలర్ బాగా వచ్చింది... ఇది చాలా కాలం తర్వాత ఉత్తమ తలైవర్ చిత్రంగా నిలుస్తుంది. ఇది సూపర్ స్టార్ అభిమానులకు సంపూర్ణమైన ట్రీట్‌గా నిలుస్తుంది అని ఆయన చెప్పారు. ఈ యాక్షన్ మూవీలో తమన్నా భాటియా, రమ్య కృష్ణన్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, వినాయకన్, యోగి బాబు వంటి స్టార్ తారాగణం నటించారు.

ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే సంగీత అభిమానులకు చేరువయ్యాయి. ఆగస్ట్ 2న ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది.ఈ చిత్రంలో మోహన్‌లాల్, తన పాత్ర కోసం రెట్రో లుక్‌ని స్వీకరించారు. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ అతిధి పాత్ర పోషించారు.సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన జైలర్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story