Jailer: 'కావాలయ్యా' హిందీ వెర్షన్ రిలీజ్.. ఈ పాటే మమ్మల్ని ప్రమోట్ చేస్తోందంటున్న తమన్నా

Jailer: కావాలయ్యా హిందీ వెర్షన్ రిలీజ్.. ఈ పాటే మమ్మల్ని ప్రమోట్ చేస్తోందంటున్న తమన్నా
'కావాలయ్యా' హిందీ వెర్షన్ 'తూ ఆ దిల్బరా' రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ - డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'జైలర్' రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమానుకళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘నువ్ కావాలయ్యా’.. సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట హిందీ వెర్షన్‌ 'తూ ఆ దిల్బరా' పాటని కూడా మేకర్స్ విడుదల చేసి, ప్రేక్షకులకు మరో బూస్టప్ ఎనర్జీని అందించారు.

తమిళ్ వెర్షన్‌లో విడుదలై నేషనల్ వైడ్‌గా వైరల్ అవుతున్న కావలయ్యా సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా స్టైలిష్ స్టెప్పులతో అలరించింది. దీంతో సాంగ్ తో పాటు, తమన్నా వేసిన స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో పలువురు రీల్స్ చేసి కూడా ట్రెండింగ్ లో నిలిచారు. అంత పాపులర్ అయిన ఈ పాట.. ఇప్పుడు హిందీ వెర్షన్ 'తూ ఆ దిల్బరా' పేరుతో సాంగ్ రిలీజైంది. దీంతో ప్రస్తుతం ఈ సాంగ్ కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనురుధ్ తన క్యాచీ బీట్స్‌తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. ఇక శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్‌ కలసి హైలీ ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్ స్వాగ్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఓ రేంజ్‌లో పాటని జనాల్లోకి తీసుకెళ్లిపోయాయి. తెలుగులోనూ ఈ పాట దుమ్మురేపుతూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ సందర్భంగా పాట లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా.. ఈ సాంగ్ హూక్ స్టెప్ వేసి అందర్నీ అలరించింది. అనంతరం కావాలా పాటకు వస్తోన్న రెస్పాన్స్ కు, ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చాలా ప్రేమను ఇచ్చారు. ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సాధారణంగా మేము సినిమాలను ప్రమోట్ చేస్తాం. కానీ ఈ పాట మమ్మల్నే ప్రమోట్ చేసింది. జైలర్ తమిళంలో రూపుదిద్దుకున్న సినిమా అయినప్పటికీ హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది అని తమన్నా చెప్పుకొచ్చారు. ఇక మేకర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ పాటను రిలీజ్ చేశారు. దాంతో పాటు ఇట్స్ టైం టు "గెట్ ఇన్ టూ ది తూ ఆ దిల్బరా ఫీవర్" అనే క్యాప్షన్ తూ వీడియో లింక్ ను, ఈ సాంగ్ కు సంభందించిన ఓ పోస్టర్ ను షేర్ చేశారు.

ఇక 'జైలర్' సినిమాలో రజనీ కాంత్ పక్కా మాస్ గా కనిపించబోతున్నారని టాక్ నడుస్తుండగా.. తమన్నా పాత్ర మాత్రం చాలా చిన్నదేనని సమాచారం. పేట సినిమాలో త్రిష తరహాలో తమన్నా అప్పుడప్పుడూ వచ్చి మెరిపిస్తుందట. ఇందులో నిజం ఎంత ఉందన్న విషయం మాత్రం విడుదల తర్వాతే తెలియనుంది.


Tags

Read MoreRead Less
Next Story