Jailer : టీవీలోకి రజినీ కాంత్ యాక్షన్ మూవీ

Jailer : టీవీలోకి రజినీ కాంత్ యాక్షన్ మూవీ
X
త్వరలో టెలివిజన్ లో ప్రసారం కానున్న 'జైలర్' మూవీ.. దీపావళికి రానున్నట్టు సమాచారం

సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొనేళ్ళుగా వరుస ప్లాపులతో అభిమానులను నిరాశపరుస్తూ వస్తున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్' సినిమాతో ఆయన మళ్లీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ కూడా ఈ సినిమా బద్దలు కొట్టేంది. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మలయాళ హీరో మోహన్లాల్ ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ఆగస్టు 10వ తేదీన థియేటర్లో విడుదలైన 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది.

ముఖ్యంగా రజనీకాంత్ కి మాత్రం అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన ఈ సినిమా.. థియేటర్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లతో పాటు.. ఓటీటీలోనూ ఈ మూవీ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రిమ్మింగ్ కు వచ్చిన 'జైలర్' సినిమా భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లో ఓటిటి లో కూడా మంచి విజయాన్ని అందుకున్న 'జైలర్' సినిమా ఇప్పుడు బుల్లితెర పైన కూడా సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ టీవీ ఛానల్ జెమినీ టీ ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ సినిమాని వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ రెండవ వారంలో లేదంటే దీపావళి పండుగ సందర్భంగా 'జైలర్' సినిమాను ప్రసారం చేయబోతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రాబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా లాభాలలో భాగంగా నిర్మాత ఇందులో ప్రతి ఒక్కరికి కూడా తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అన్ని చోట్లా మంచి విజయాన్ని, టాక్ ను అందుకున్న ఈ మూవీ.. మరి టీవీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.



Tags

Next Story