Jailer Show Case Trailer: ట్రెండింగ్ లో రజనీ యాక్షన్ ట్రైలర్.. అప్పుడే 5మిలియన్లు దాటేసింది

Jailer Show Case Trailer: ట్రెండింగ్ లో రజనీ యాక్షన్ ట్రైలర్.. అప్పుడే 5మిలియన్లు దాటేసింది
రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న 'జైలర్ - షోకేస్' ట్రైలర్

ఈ వీకెండ్ లో ఇద్దరు స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్. చిరంజీవి 'భోళా శంకర్' తో వస్తుండగా, రజనీకాంత్ 'జైలర్' తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే రజనీకాంత్ 'జైలర్' విషయానికొస్తే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజై అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఇప్పటికే మూవీపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జైలర్ షోకేస్ పేరుతో రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే 5మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.

మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న 'జైలర్' సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీలో రజనీ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపించనుంది. వీరితో పాటు ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, సీనియర్ నటి రమ్యకృష్ణ, సునీల్, జాకీ ష్రాప్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆగస్టు 10న పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. 'జైలర్' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా జైలర్ లోని కావాలా సాంగ్.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది. ఈ సాంగ్ లో తమన్నా ఎన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసి కుర్రకారుకు కునుకు లేకుండా చేయగా.. రజనీ స్టెప్పులతో అలరించాడు. దీంతో ఈసినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని రజినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే ఫుల్ యాక్షన్, ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే తుపాకులు చప్పుళ్లు, బాంబు మోతలతో దద్దరిల్లింది. ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే అనే డైలాగ్ మరింత ఆసక్తిని రేపుతోంది. ఈమధ్యే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో చిత్ర నిర్వాహకులు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న జైలర్ ట్రైలర్... అంత అద్భుతంగా ఉందనిపించేలా లేకపోయినప్పటికీ ప్రేక్షకులు, సినీ ప్రియులు, రజనీ ఫ్యాన్స్ నుంచి మాత్రం సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ తరహా ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story