Jailer Trailer: బ్యాక్ టూ తలైవా.. స్టైల్ అండ్ స్వాగ్ తో అదరగొట్టిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ 'జైలర్' చిత్రానికి సంబంధించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ట్రైలర్ రిలీజ్ అయింది. తలైవా స్టైల్ తో మరోసారి ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, టీజర్‌తో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా ఈ జైలర్ మూవీ వస్తోంది. దీంతో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై రజినీ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా 'జైలర్ షోకేస్' పేరుతో తెలుగులో కంటే ముందే తమిళంలో ఈ ట్రైలర్ వచ్చింది.
'జైలర్' ట్రైలర్ పవర్‌ఫుల్‍గా ఉంది. రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదిరిపోయేలా ఉన్నాయి. తలైవా రజినీ మార్క్ డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్‌గా ఉంది. తెలుగు యాక్టర్ సునీల్ కాస్త డిఫరెంట్ గెటప్‍లో కనిపించాడు. మొత్తానికి ఈ ట్రైలర్ అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేదిగా ఉంది. ఇక ఫుల్ మూవీ రజనీ ఫ్యాన్ ను ఎంతగా అలరిస్తోందో విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Here is the gripping showcase of Superstar Rajinikanth's #Jailer in
— Sun Pictures (@sunpictures) August 2, 2023
Telugu - https://t.co/GTLuqeUAd2
Kannada - https://t.co/wfeteysgEF#JailerShowcase @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan… pic.twitter.com/6vhy0wEbUZ
ట్రైలర్ ఎలా ఉందంటే..
ఒక జైలర్ అయిన రజినీకాంత్ ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్ జీవితాన్ని గడుతుంటాడు. తనలోని యాక్షన్ వ్యక్తిని ఇంటిలో వాళ్ళకి కూడా చూపించకుండా చాలా సైలెంట్ గా ఉన్న హీరో లైఫ్ లోకి విలన్ ఎంట్రీ ఇస్తే.. ఆ తరువాత కుటుంబం కోసం ఆ ఫ్యామిలీ మ్యాన్ జరిపే యుద్ధమే జైలర్ కథ అని తెలుస్తుంది. ఈ మూవీలో రజినీకి భార్యగా రమ్యకృష్ణ నటిస్తుంది. జాకీ ష్రాఫ్ విలన్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ అయితే యాక్షన్ పార్ట్ తో ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ మూవీ ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇటీవలే చెన్నైలో 'జైలర్' సినిమా ఆడియో వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 'నువ్వు కావాలయ్యా', 'హుకుం' పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. హుకుం పాట తెలుగు వెర్షన్‌ను విక్టరీ వెంకటేశ్ ఈ మధ్యే సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం ఇప్పటికే జోరు పెంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com