RRR: 'అవతార్' డైరక్టర్‌కీ 'ఆర్ఆర్ఆర్' నచ్చింది.. : ఆనందంలో రాజమౌళి

RRR: అవతార్ డైరక్టర్‌కీ ఆర్ఆర్ఆర్ నచ్చింది.. : ఆనందంలో రాజమౌళి
RRR: ఒక ప్రశంస ఎంతటి కష్టాన్నైనా మరిపిస్తుంది. అతడికి సినిమా ఓ డబ్బులు వచ్చే మాద్యమం కాదు.. ఓ ప్యాషన్.. వరుస పెట్టి ఏడాదికో సినిమా తీసే దర్శకుడు కాదు..

RRR: ఒక ప్రశంస ఎంతటి కష్టాన్నైనా మరిపిస్తుంది. అతడికి సినిమా ఓ డబ్బులు వచ్చే మాద్యమం కాదు.. ఓ ప్యాషన్.. వరుస పెట్టి ఏడాదికో సినిమా తీసే దర్శకుడు కాదు.. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే తాను అనుకున్నది చేస్తాడు ఎవరేమనుకున్నా. అందుకే అతడికి ఆ చిత్రం ప్రపంచ స్థాయిలో పేరు తీసుకువచ్చి పెడుతుంది. టాలీవుడ్ దర్శకుని ప్రతిభ హాలీవుడ్‌లోనూ మార్మోగుతోంది అంటే ఆయన ఎంతటి ప్రతిభాశాలో అర్థమవుతోంది. రాజమౌళి తెలుగు దర్శకుడు అవడం మనందరికీ గర్వకారణం. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ ఆయన చిత్రం ఆర్ఆర్ఆర్‌ని ఆస్వాదిస్తున్నారు.


లాస్ ఏంజిల్స్‌లో గత రాత్రి జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుకలో రాజమౌళి జేమ్స్ కామెరూన్‌ను కలిశారు. కామెరూన్ ''RRR"ని రెండుసార్లు చూశానని చెప్పారు. 'అవతార్' సృష్టికర్త తెలుగు సినిమా చూసేలా చేశాడు రాజమౌళి.



జేమ్స్ కెమరూన్‌తో కలిసి దిగిన ఫోటోలను రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ RRRని చూశాడు.. అతను ఆర్ఆర్ఆర్‌ని ఎంతగానో ఇష్టపడ్డారు. తన భార్య సుజీకి కూడా చూడమని చెప్పి ఆమెతో కలిసి మరోసారి ఆర్ఆర్ఆర్ చూశారు. సార్.. మీరు మా సినిమాని విశ్లేషించడానికి మాతో మొత్తం 10 నిమిషాలు గడపడం.. ఇదంతా నిజమా కలా.. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. మీకు ధన్యవాదాలు అని రాజమౌళి పోస్ట్ పెట్టారు. 'RRR' టీమ్ అకాడమీ అవార్డు నామినేషన్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ నెలాఖరులో అకాడమీ అవార్డు నామినేషన్లు వెల్లడికానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story