Jana Nayagan : జన నాయగన్.. ఓ అఫీషియల్ రీమేక్

జన నాయగన్.. ఇళయదళపతి గా పేరున్న విజయ్ హీరోగా నటిస్తోన్న మూవీ. అఫ్ కోర్స్ అది అతని చివరి సినిమాగానూ చెబుతున్నారు. ఇకపై సినిమా ఇండస్ట్రీని వదిలేసి మొత్తంగా రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడు విజయ్. ఈ విషయంలో ఫ్యాన్స్ లో మిక్స్ డ్ ఒపీనియన్ కనిపిస్తోంది. బట్ అతను మాత్రం ఓ వైపు ఆల్రెడీ పొలిటికల్ ఇష్యూస్ తో తలపడుతున్నాడు. తీరిగ్గా దొరికిన వెంటనే పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ లాగా పొలిటికల్ డైలాగ్స్ తో కూడా పాపులర్ అవుతున్నాడు. అది ఎలా ఉన్నా.. అతని ఇప్పుడు చివరి సినిమా విషయంలో మాత్రం కాన్ సెంట్రేట్ కూడా చేస్తున్నాడు.
జన నాయగన్ లో మాత్రం పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మమితా బైజు ఓ కీలక పాత్రలో చేస్తుంది. అయితే ఈ చిత్రం మాత్రం తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి లో కొన్ని సీన్స్ కూడా ఉంటాయనీ, ముఖ్యంగా బాలయ్య లాగా గుడ్, బ్యాడ్ టచ్ గురించిన సీన్ ను కూడా విజయ్ రీ క్రియేట్ చేయబోతున్నాడు అనేది తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రం చేయబోతున్నారు అనేది తెలుస్తోంది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ విషయంలో ఓ కీలకమైన అంశం వినిపిస్తోంది.
జన నాయగన్ ని అచ్చంగా భగవంత్ కేసరి చిత్రం రీమేక్ చేస్తున్నాడట. భగవంత్ కేసరి లో మామూలుగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన మూవీ. ఆ చిత్రాన్ని హెచ్ వినోద్ తో రీమేక్ చేయబోతున్నాడని టాక్. అందుకోసం ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ క్యారెక్టర్ ను అచ్చంగా దింపాడట విజయ్. మామూలుగా విజయ్ కి సంబంధించిన సీన్స్ ను చూసిన వాళ్లంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. భగవంత్ కేసరిలో రీమేక్ చేస్తున్నాడట. ఆ మాత్రం దానికి తెలుగు డబ్బింగ్ సినిమాగా ఏం చూస్తారు అంటున్నారు. చూస్తుంటే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ ప్రొడ్యూసర్స్ గా నాగవంశీ మాత్రం మరోసారి తీవ్రంగా నష్టపోవడం ఖాయం అంటున్నారు. అన్నట్టు ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ కాబోతోంది. అదే రోజున రాజా సాబ్ కూడా రిలీజ్ కాబోతోందన్నమాట. చూద్దాం .. ఈ తమిళ్ రీమేక్ మూవీ తెలుగు డబ్బింగ్ సినిమాలా నిజంగా అనిపిస్తుందా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

