RRR Movie : నవంబర్ 26న 'జనని' గీతం...!

RRR Movie : నవంబర్ 26న జనని గీతం...!
RRR Movie : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

RRR Movie : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు అభిమానులను ఉర్రూతలుగిస్తున్నాయి. కాగా తాజాగా మరో అప్డేట్ తో మేకర్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాలోని 'జనని' గీతాన్ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. చూస్తుంటే ఇది దేశభక్తి పాట లాగా కనిపిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story