Allu Arjun : అల్లు అర్జున్ కి జనసేన వార్నింగ్స్

Allu Arjun :   అల్లు అర్జున్ కి జనసేన వార్నింగ్స్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కు పొలిటికల్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి చెందిన నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి సపోర్ట్ చేయడం జనసేనకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ కోసం వెళ్లలేదు అనేదే అసలు కారణం అయితే.. కూటమి కోసం మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటై ప్రచారం చేస్తే ఇతను మాత్రమే వైసీపి అభ్యర్థి కోసం వెళ్లాడు అనే అక్కసు కొద్దీ అల్లు అర్జున్ పై కక్ష కట్టారు. దీనికి నాగబాబు కాస్త ఆజ్యం పోయడం.. తర్వాత మెగా ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ ను డైరెక్ట్ గానే విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన పుష్ప 2 ను కూడా వాయిదా వేశారు. డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నారు. ఈ గ్యాప్ లో కాస్త కోపాలు తగ్గుతాయి అనుకున్నారు చాలామంది. తగ్గలేదు సరికదా ఇది.. ఫ్యాన్స్ నుంచి పొలిటీషియన్స్ వరకూ వెళ్లింది.

జనసేన ఎమ్మెల్యే ఆ మధ్య బాహాటంగానే విమర్శించాడు. తాజాగా జనసేన పార్టీకి చెందిన కొందరు రాజకీయ నేతలు పుష్ప 2ను తమ ప్రాంతంలో విడుదల కానివ్వం.. ఎలా విడుదల చేస్తారో చూస్తాం.. అంటూ డైరెక్ట్ గానే వార్నింగ్ లు ఇస్తుండటం కలకలం రేపుతోంది. రాజకీయాలు వ్యక్తిగతం. సినిమా అనేది కొన్ని వేలమంది కలల ప్రపంచం. ఆ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించాలనే తపనే కనిపిస్తుంది. దీనికి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ.. ఏకంగా సినిమానే ఆపేస్తాం అని వార్నింగ్ ఇవ్వడం సబబు కాదు అని అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే సడెన్ గా మళ్లీ పుష్ప 2ను ఎందుకు టార్గెట్ చేశారు. మరోసారి ఈ గొడవకు కారణం ఏంటీ అంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అస్సలు తగ్గడం లేదు. ఈ కారణంగానే జనసేన రంగంలోకి దిగింది. వీరికి కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తోడైతే పుష్ప 2కు ఏపిలో చాలా కష్టాలే వస్తాయి. బట్ ఇప్పటికే ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ లేకుండానే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. సో.. ఏపిలో ఆపితే పుష్ప 2కు వచ్చే నష్టం భారీగా ఉండదు. ఉన్నా.. మిగతా ప్రాఫిట్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ కవర్ చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక హీరోను టార్గెట్ చేస్తూ సినిమాను ఆపేస్తాం అనే వరకూ రాజకీయాలు వచ్చాయి అంటే గత ప్రభుత్వానికి వీరికి మధ్య తేడా ఏం లేదు అనే అనుకోవాలి.

Tags

Next Story