Janhvi Kapoor: జాన్వీ బ్యాక్‌లెస్ జమ్ సూట్‌.. నెటిజెన్స్ ట్రోల్స్

Janhvi Kapoor: జాన్వీ బ్యాక్‌లెస్ జమ్ సూట్‌.. నెటిజెన్స్ ట్రోల్స్
Janhvi Kapoor: అనన్య తెల్లటి క్రాప్ టాప్ వైట్ జీన్స్‌తో సింపుల్ గా ఉంటే జాన్వీ వేసుకున్న డ్రెస్ మాత్రం కెమెరా దృష్టిని ఆకర్షించింది.

Janhvi Kapoor: అందాల తారలు జాన్వీ కపూర్, అనన్య పాండే బెస్ట్ ఫ్రెండ్స్ అని బాలీవుడ్ మొత్తానికి తెలుసు. స్టార్ కిడ్స్ తరచుగా నైట్ డిన్నర్ పార్టీలో కలిసి కనిపిస్తారు. ఇటీవల, జాన్వీ, అనన్య ముంబైలోని ఓ రెస్టారెంట్ నుండి బయటికి వస్తూ కనిపించారు. అనన్య తెల్లటి క్రాప్ టాప్ వైట్ జీన్స్‌తో సింపుల్ గా ఉంటే జాన్వీ వేసుకున్న డ్రెస్ మాత్రం కెమెరా దృష్టిని ఆకర్షించింది.

నీలిరంగు బ్యాక్‌లెస్ జమ్ సూట్‌ను ధరించి కనిపించింది. డిన్నర్ తర్వాత రెస్టారెంట్ నుండి బయటికి వచ్చినప్పుడు ఆమెను, ఆమె డ్రెస్ ను చూసి అవాక్కయ్యారు. ఫోటోగ్రాఫర్లు కెమెరాలకు పని చెప్పారు. ఈ ఫోటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.. జాన్వీ డ్రెస్ చూసి ముక్కుమీద వేలేసుకుంటున్నారు నెటిజన్స్..

అయినా ఎందుకులే అనుకోవడం.. సినిమా తారలు కదా.. అవకాశాలు రావద్దు మరి.. అలాంటి డ్రెస్ లు వేస్తేనే కదా ఆఫర్లు వచ్చేది అని మరికొందరు జాన్వీని ట్రోల్ చేస్తున్నారు. అనన్యను కానీ, అనన్య డ్రెస్ ని కానీ కామెంట్ చేయకుండా జాన్వీని మాత్రమే కామెంట్ చేస్తున్నారు. ఫోకస్ అంతా జాన్వీపైనే పెట్టి ఒక ఆట ఆడుకుంటున్నారు.


కొంతమంది అభిమానులు ప్రేమ చూపిస్తే చాలామంది మాత్రం జాన్వీ మీద ఫైర్ అవుతున్నారు. జాన్వీ దుస్తులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటి సొగసులన్నీ ఆరబోస్తుందని, ఆమె సెలక్షన్ అస్సలు బాలేదని విమర్శిస్తున్నారు. జాన్వీ నటించిన చిత్రం ధడక్ షూటింగ్ సమయంలో ఆ చిత్రంలోని హీరో ఇషాన్ తో డేటింగ్ చేసినట్లు అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

కాగా, జాన్వీ తాజా ప్రాజెక్టులు.. వరుణ్ ధావన్ సరసన బవాల్‌లో నటించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్టర్ అండ్ మిసెస్ మహిలో రాజ్‌కుమార్ రావు సరసన జాన్వీ కనిపించనుంది. ఆమె రాబోయే చిత్రాలలో గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2 కూడా ఉన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story