Chuttamalle Song: చుట్టమల్లేకు వస్తోన్న రెస్పాన్స్ కు డబుల్ హ్యాపీ : జాన్వీకపూర్
'దేవర' సెకండ్ సాంగ్ యూట్యూబ్ షేక్ చేస్తోంది. ఇక ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ అందాలకు, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాటపై జాన్వీ స్పందించారు. రిలీజ్ అయిన రోజు నుంచి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విశేషాలు పంచుకుంటోంది జాన్వీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'చుట్టమల్లే..'కు వస్తోన్న రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది. నెగెటివ్ ట్రోల్స్ రాలేదు ఇది మరింత సంతోషాన్నిచ్చింది'అంటోంది జగదేక సుందరి తనయ. తన డ్యాన్స్తో పాటు కెమిస్ట్రీ కూడా అందరికీ నచ్చిందంటోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీకపూర్ - ఎన్టీఆర్ పై చిత్రీకరించిన చుట్టమల్లే పాటను విడుదల చేశారు. విజువల్ వండర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ ట్రెండింగ్లో ప్రథమ స్థానంలో ఇది దూసుకెళ్తంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com