Janhvi Kapoor: జాన్వి కపూర్ విలాసవంతమైన ఇంటి లోపలి చిత్రాలు..

Janhvi Kapoor: బాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన జాన్వి కపూర్ తన మూడేళ్ల కెరీర్‌లో అభిమానులను సంపాదించుకోగలిగారు. అందాల తార శ్రీదేవి, చిత్రనిర్మాత బోనీ కపూర్ దంపతులకు జన్మించిన జాన్వి, చిన్నప్పటి నుంచే మీడియా దృష్టిని ఆకర్షించింది.
జాన్వి 2018 లో ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ముంబయిలో తన కోసం ఒక ఇంటిని కొనుగోలు చేయడంతో 2021 సంవత్సరం తనకి ఓ మంచి విషయంతో ప్రారంభమైందని అంటోంది. దీని ధర 39 కోట్ల రూపాయలు. ఇది కాకుండా, లక్షల విలువైన లగ్జరీ కార్లు కూడా ఆమె గ్యారేజ్ లో ఉంటాయి.
ముంబైలోని జాన్వి కపూర్ రాజభవనం యొక్క లోపలి ఫోటోలను తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్లతో పంచుకుంది. ఖరీదైన సోఫాలు, పాలరాయి ఫ్లోరింగ్, పాతకాలపు షాన్డిలియర్లు, స్టాండ్ అవుట్ మిర్రర్స్, స్టేట్మెంట్ డెకర్ ముక్కలు, గోడలపై అనేక సమకాలీన కళాకృతులు, జాన్వీ విలాసవంతమైన ఇంటికి క్లాసిక్ రూపాన్ని అందించాయి.
ఆమె వర్క్ ఫ్రంట్ గురించి..
జాన్వి కపూర్ చివరిసారిగా రూహిలో కనిపించింది. ఇందులో ఆమె రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మలతో కలిసి పని చేసింది. జాన్వీ రాబోయే సినిమాలు దోస్తానా 2, తఖ్త్, గుడ్ లక్ జెర్రీ ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com