Mili Promotion: 'మిలి' ప్రమోషన్.. థియేటర్లో పాప్‌కార్న్ అమ్ముతున్న జాన్వీ..

Mili Promotion: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన రాబోయే మూవీ 'మిలి' ప్రమోషన్స్‌లో భాగంగా థియేటర్‌లో సందడి చేసింది. ఢిల్లీలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌కు ఆమె స్వయంగా పాప్‌కార్న్ సర్వ్ చేశారు. కౌంటర్ వెనుక నుంచి జాన్వీ కపూర్ పాప్‌కార్న్‌లు సర్వ్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఈ చిత్రానికి మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇది మలయాళ చిత్రం హెలెన్‌కి రీమేక్. మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలలో నటించారు.
మిలీకి సంబంధించిన ప్రచార జోరు ఇప్పటికే కొనసాగుతోంది. నవంబర్ 4న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం వివిధ రాష్ట్రాలకు వెళ్లి ప్రమోషన్ చేస్తోంది. అందులో భాగంగానే జాన్వీ ఇటీవల చిత్ర యూనిట్‌తో కలిసి ఢిల్లీ వెళ్లింది.
ఢిల్లీలోని ఒక థియేటర్‌లోని ఫుడ్ కోర్ట్‌లో గ్లోవ్స్ ధరించి కస్టమర్స్‌కు పాప్ కార్న్ సర్వ్ చేస్తోంది.
అయితే కొందరు మాత్రం జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. సినిమా కోసం నటీ నటులు ఏమైనా చేస్తారు. బాత్ రూమ్‌లు కూడా కడిగేస్తారు. శ్రీదేవి, బోనీ కపూర్‌ల కుమార్తె ఇలా చేయడం ఏం బాగాలేదు అని మరొకరు వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com