Janhvi Kapoor : అలాంటి పాత్రలు చేయను : జాన్వీ కపూర్

Janhvi Kapoor : అలాంటి పాత్రలు చేయను : జాన్వీ కపూర్

దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది జాన్వీ. "నేను జుట్టు లేకుండా ఉండే పాత్రలు అస్సలు చేయను. ఎంత కష్టమైనా భరిస్తాను కానీ జుట్టు మాత్రం కట్ చేసుకోను. నా మొదటి సినిమా దఢక్ కోసం కొంచెం జుట్టు కట్ చేశాను. అప్పుడు అమ్మ కోప్పడింది. ఏ పాత్ర కోసం అయినా సరే జుట్టును మాత్రం కట్ చేసుకోవద్దని చెప్పింది. ఆమె మాట నేను దాటను. అందుకే జుట్టు లేకుండా ఉండే పాత్రలు వస్తే చేయను అని చెప్పేస్తాను" అని చెప్పింది. ఇక జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఆర్సి 16లో హీరోయిన్ గా నటిస్తున్నారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది.

Tags

Next Story