Janhvi Kapoor : జుట్టులేకుండా నటించను : జాన్వీకపూర్

Janhvi Kapoor : జుట్టులేకుండా నటించను : జాన్వీకపూర్
X


అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్.. బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి.. తాజాగా విడుదలైన దేవరతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. జూనియర్ తో జోడీగా నటించిన ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసింది జాన్వీ.. తర్వాత ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజ్ మీడియం తదితర సినిమాల్లో నటించింది. ఇటీవల విడుదలైన దేవర సినిమాలో గ్లామరస్ గా కనిపించింది జాన్వీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తల్లిని గుర్తు చేసుకుంది.. 'సినిమాల్లో జుట్టు లేకుండా నేను నటించాల్సి వస్తే అస్సలు చేయను.. ఆలాంటి పాత్రలను కూడా ఒప్పుకోను. నా మొదటి మూవీ దఢక్ కోసం కొంచెం జుట్టు కట్ చేశాను. అప్పుడు అమ్మ నామీద కోపగించుకుంది. ఏప్రాత చేసినా సరే జట్టు మాత్రం కట్ చేసుకోవద్దని చెప్పింది. అమ్మ మాటను నేను దాటను. అందుకే జట్టు లేకుండా పాత్రలు చేయను' అని చెప్పేసింది.ఇక సినిమాల విషయానికి వస్తే..దేవర ఇటీవలే రిలీజ్ కాగా... ఆర్సీ 16లో రాంచరణ్ తో నటిస్తోంది జాన్వీ. ఈ సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. జాన్వీ చేతిలో ఉలాజ్, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి సినిమాలున్నాయి.

Tags

Next Story