సినిమా

Janhvi Kapoor: మలయాళ దర్శకుడికి థాంక్యూ చెప్పిన జాన్వీ కపూర్.. ఎందుకంటే..

Janhvi Kapoor: అతిలోకి సుందరి శ్రీదేవి మరణానంతరం ఇండస్ట్రీలోకి ఆమె వారసురాలిగా అడుగుపెట్టింది పెద్ద కూతురు జాన్వీ కపూర్.

Janhvi Kapoor (tv5news.in)
X

Janhvi Kapoor (tv5news.in)

Janhvi Kapoor: అందాల తార, అతిలోకి సుందరి శ్రీదేవి మరణానంతరం ఇండస్ట్రీలోకి ఆమె వారసురాలిగా అడుగుపెట్టింది పెద్ద కూతురు జాన్వీ కపూర్. మొదటి సినిమా 'ధడక్' నుండి ఇప్పటివరకు ప్రేక్షకులను మెప్పించడానికి.. తల్లికి తగిన కూతురు అని మెప్పు పోందడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే జాన్వీ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అడుగులేస్తుంది.

జాన్వీ కపూర్ ఎంట్రీని తన బాధ్యతగా తీసుకున్నాడు కరణ్ జోహార్. కానీ ఇప్పటినుండి తండ్రి బోణీ కపూరే.. జాన్వీ తరువాత సినిమాలను దగ్గరుండి పరిశీలించనున్నాడు. ఇక పరభాషలో హిట్ అయిన సినిమాలను వెంటనే తమ భాషలోకి అనువదించడంలో బాలీవుడ్ ఎప్పుడు ముందే ఉంటోంది. జాన్వీ తరువాత చిత్రం కూడా అలాంటి ఒక రీమేకే.

మలయాళంలో అన్నా బెస్ హీరోయిన్‌గా మాథ్యు కుట్టి జేవియర్ దర్శకుడిగా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రమే 'హెలెన్'. ఈ సినిమా మాథ్యుకు మొదటిది. అయినా ఫస్ట్ సినిమాకే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా తనకు నేషనల్ అవార్డును అందజేసింది హెలెన్. నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన వారంతా మెచ్చుకోవడంతో పాటు రీమేక్ రైట్స్ కోసం పోటీపడ్డారు కూడా.

హిందీలో హెలెన్ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత బోణీ కపూర్ దక్కించుకున్నారు. ఇక వేరే హీరోయిన్ ఎందుకని ఈ సినిమాలో తన కూతురు జాన్వీనే లీడింగ్ లేడీగా ఎంపిక చేశారు. హెలెన్‌ను డైరెక్ట్ చేసిన మాథ్యునే బరిలోకి దించారు. దీనికి 'మిలి' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. తాజాగా మిలి షూటింగ్ పూర్తయింది. దీంతో జాన్వీ కపూర్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో సినిమా గురించి పోస్ట్ చేసి దర్శకుడికి థ్యాంక్స్ చెప్పుకుంది.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES