Jani Master : ఈ నాలుగు రోజుల్లో మలుపుతిరగనున్న జానీ మాస్టర్ కెరీర్

Jani Master : ఈ నాలుగు రోజుల్లో మలుపుతిరగనున్న జానీ మాస్టర్ కెరీర్
X

జానీ మాస్టర్ కు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ ను కాసేపట్లో పోలీసులు కస్టడీలోనికి తీసుకోనున్నారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో జానీ మాస్టర్ పై పోక్స్ కేసు నమోదైంది. జానీ మాస్టర్ మాత్రం తనను కావాలనే కేసులో ఇరికించారని చెబుతున్నారు. నిన్న చంచల్ గూడ జైలులో జానీ మాస్టర్ ను కలిసిన ఆయన భార్య ఆయేషా.. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు.

Tags

Next Story